ప్రముఖ సినీ నటులు బీజేపీ నేత కృష్ణంరాజు మరణంపై సినీ ప్రముఖులు,రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సినీ నటుడు కృష్ణంరాజు ఇక లేరన్న విషయంపై సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గొప్పతనాన్ని స్మరించుకున్నారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కృష్ణంరాజు మరణంపై స్పందించారు. ‘‘కేంద్ర మాజీ మంత్రి, నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని ట్వీట్ చేశారు.
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సానుభూతి తెలిపారు మరియు ఆయనతో వున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.
సినిమాల్లో, రాజకీయాల్లో కృష్ణంరాజు గారు చేసిన సేవలు, సాధించిన ఘనతను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు ప్రగాఢ సానుభూతి తెలిపారు టీడీపీ యువనేత నారా లోకేష్