ఓ ఎస్‌ఐ మానవత్వాన్ని చాటుకున్నారు. అనాథ శవాన్ని పారిశుధ్య కార్మికుడి సాయంతో పొలాల్లో నుంచి మోసుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలోని రహదారిపైకి చేర్చారు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలంలో జరిగింది. ఎల్.సింగవరం రెవెన్యూ పరిధిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం ఉన్నట్టు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది.
ఎస్‌ఐ బి.రామకృష్ణ, కానిస్టేబుల్ పైడిరాజు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించేందుకు ఎవరూ ముందుకురాలేదు. దాంతో ఎస్‌ఐ రామకృష్ణ కర్రలు, కొబ్బరి మట్టల సాయంతో పాడే తయారు చేయించారు. దానిపై మృతదేహాన్ని ఉంచి ఓ పారిశుధ్య కార్మికుడి సహకారంతో స్వయంగా మోసుకుంటూ పొలాల్లోంచి రెండు కిలోమీటర్ల దూరంలో గల రహదారిపైకి చేర్చారు. అక్కడి నుంచి ఆటోలో అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చారు.