తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు(69) తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉన్నట్లు తమిళనాడు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్‌లో పాల్గొని జాగ్రత్తగా ఉండాలని ట్విటర్ ద్వారా సీఎం స్టాలిన్ పిలుపు ఇచ్చారు.
తమిళనాడు గత కొంతరోజులుగా.. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్, సబ్ వేరియెంట్స్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయని తమిళనాడు వైద్య శాఖ చెబుతోంది. సుమారు 2వేలకు పైనే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి తమిళనాడులో.