నేతన్నలు బతికించేందుకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు విసురుకుంటున్న ఛాలెంజీలు ఇంటరెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలు ధరించి బాలినేనికి ఛాలెంజ్ విసిరారు. దీనికి బాలినేని కూడా ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. ఇక తాజా ట్వీట్స్ లో బాలినేని జనసేనానిని టాగ్ చేసి రిప్లై ఇచ్చారు. ఇదే ట్వీట్ లో జగన్ సర్కార్ చేపడుతున్న పథకాలను సైతం అందులో పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో తాను చేనేత మంత్రిగా పనిచేసి సందర్భంలో రూ.300 కోట్ల రుణమాఫీ చేశానంటూ బాలినేని గుర్తు చేశారు. పీకే ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ తాను చేనేత వస్త్రాలను ధరించానని.. అందరూ కూడా అలా ధరించాలని కోరారు. బాలినేని ట్వీట్ కి స్పందించిన పవన్ కళ్యాణ్ “చేనేత కార్మికుల కోసం మీరు ఎంతో చేశారు. దానికి అభినందనలు. మరో సారి నేతన్నల కోసం మీరు చూపించిన కమిట్మెంట్ కి ధన్యవాదాలు” అని పవన్ కళ్యాణ్ బదులిచ్చారు. ఏపీలో వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ఈ టైంలో పవన్ కల్యాణ్.. బాలినేనికి ఛాలెంజ్ విసరడం..దానికి సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బాలినేని జనసేన వైపు చూస్తున్నారా ? అనే ప్రచారం ఇప్పటికే మొదలయ్యింది. ఐతే తమ పార్టీకి చెందిన కొంతమంది నేతలు కావాలనే తనమీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పదవి నుంచి తనను తప్పించడం పట్ల కూడా బాలినేని చాలా అసంతృప్తితో ఉన్నారనే స్పష్టమౌతోంది. ఈ టైంలో ఈ ఛాలెంజెస్ ట్వీట్స్ చూస్తుంటే ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఐతే ఇటీవల ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్త వైసీపీ నుంచి జనసేనకు మారిపోయారు. పేకాట ఆడే విషయంలో బాలినేని సుబ్బారావుపై చేసిన ప్రకటనకు ఆయన మండిపడ్డారు. ఇలా వైసీపీలో రోజురోజుకు కొత్త పోకడలు కనిపిస్తుంటే ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీ నుంచి ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా జంప్ అవుతున్నారో తెలియక ఇంత దారుణంగా మారాఏంటి రాజకీయాలు అంటి ప్రజలు అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.