దేశంలో ఇప్పుడు అత్యంత వివాదాస్పద ఢిల్లీ లిక్కర్ స్కాం లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు పేరు బయటకు రావడం ఒక సంచలం. పోనీలే ఇందులో మన ఆంధ్రప్రదేశ్ లేదు అనుకొనే లోపే పెద్ద పెద్ద పేర్లు బయటకు వస్తున్నాయి. సాక్షాత్తు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విజయవాడ వచ్చి ఢిల్లీ లిక్కర్ స్కాం కి ఆంధ్ర వైసీపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయి అని బాంబ్ పేల్చారు. ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి ఢిల్లీ లిక్కర్ స్కాం తో సంబంధాలు ఉన్న వారి పేర్లు ఆధారాలతో సహా బయట పెట్టారు.
ప్రభుత్వంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు లిక్కర్ స్కామ్ జరుగు తోందని ఆరోపించారు. ఆదాన్ అనే డిస్టిలరీ స్థాపించి విజయసాయిరెడ్డి స్కామ్ లు చేస్తున్నారని విమర్శించారు. జగతి పబ్లికేషన్స్‌కు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌కు ఆర్థిక సంబం ధాలున్నాయని ఆరోపించారు. క్విడ్ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్‌కు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కోట్లు మళ్లించిందన్నారు. విజయ సాయి రెడ్డితో ఆర్థిక సంబంధాలున్న పనాక శరత్‌రెడ్డిని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారిస్తోందని తెలిపారు. తన లావాదేవీల కోసమే జగన్ దావోస్ వెళ్లారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతి విజయసాయిరెడ్డిల పాత్ర ఉందని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
ఇంకా ఆనం వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ…అదాన్ డిస్టిలరీస్ ద్వారా అక్ర మంగా సంపాదించిన రూ.5 వేల కోట్ల సొమ్ము ను ఢిల్లీ స్కామ్‌లో ఉపయోగించినట్లు చెప్పారు. హైదరాబాదులో 19 కంపెనీలు ఒకే చిరునామాతో ఉన్నాయని వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆయా కంపెనీల్లో ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ డైరెక్టర్ గా ఉన్నాడని వెల్లడించారు. అవి జగన్, విజయసాయిల సూట్ కేసు కంపెనీలేనని ఆనం ఆరోపించారు. రోహిత్ కంపెనీలో అదాన్ డిస్టిలరీస్ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. 2019లో అదాన్ డిస్టిలరీకి ఎవరు అనుమ తిచ్చారని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో రూ.2,400 కోట్ల మద్యం ఎలా అమ్మారని నిలదీశారు. ఏది ఏమైనా ఢిల్లీ ను కుదిపేస్తున్న liquor స్కాం ఆంధ్రా రాజకీయాలను కూడా షేక్ చేస్తోంది.