జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించినట్లు పోలీసులు తెలిపారు. “బారాముల్లా జిల్లాలోని వనిగం బాలా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది” అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
“పోలీసులు, భద్రతా దళాలు ఉగ్రవాదులను వెతికే పనిలో ఉన్నాయి.” జిల్లాలోని క్రీరి ప్రాంతంలోని వనిగం బాలాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయన్నారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిందన్నారు.