పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘లైగర్’ ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘జనగణమన’ అనే చిత్రం కూడా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా పూర్తిచేయనున్నాడు. ప్రేమకథల స్పెషలిస్టుగా చెప్పుకునే శివ నిర్వాణ డైరెక్షన్లో ‘ఖుషి’ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా సమంత నటించనుంది. ఈ మూవీ ఫస్టు షెడ్యూల్ ను కశ్మీర్ లో ప్లాన్ చేశారు. తాజాగా ఆ షెడ్యూల్ షూటింగును ఈ సినిమా టీమ్ పూర్తిచేసింది. నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హీషమ్ ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఇక సమంత విషయానికొస్తే ఆమె లీడ్ రోల్ లో నటించిన ‘యశోద’ విడుదలకి సిద్ధమవుతోంది. ఇక ‘శాకుంతలం’ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకులను పలకరించనుంది. సమంత మరో వైపు బాలీవుడ్ ప్రాజెక్టులతోను బిజీగా ఉంది.