మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రింగ్ రోడ్డు భూ సమీకరణలో అక్రమాలు జరిగాయంటూ కొద్దిరోజుల క్రితం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో నారాయణతో పాటు లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్‌స్ట్రక్షన్స్ హైకోర్టును ఆశ్రయించాయి. ముందస్తు బెయిల్ కోసం గత వారం నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది.