చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో అబద్దాలు రాసే ప్రయత్నాన్ని మానుకొని, వాస్తవాలు చెబితే.. ప్రజలు మెచ్చుకుంటారు అని ఏపి ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. దుర్మార్గపు రాజకీయాలు చేసిన పచ్చి మోసగాడు చంద్రబాబు, ఎల్లో మీడియా ఆరాటం తప్ప.. చంద్రబాబు రాజకీయంగా బతకడు’ అని ఎద్దేవా చేశారు. ప్రజలు వైస్ జగన్‌కు దూరం కారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. పోలవరానికి సంబంధించి డయాఫ్రం వాల్ దెబ్బతినడం వల్ల పనుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవం అన్నారు.. వాల్ నిర్మాణం.. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంటలు ఏర్పడి.. వాటిని సరిచేయాల్సిన అనివార్య పరిస్థితి రావడం విచారకరమన్నారు. టీడీపీ తప్పుడు విధానాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, జలశక్తి అడ్వైజర్ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈఎన్‌సీ, సీడబ్ల్యూసీ నిపుణులు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చి రీడిజైన్ చేసి గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు.
డయాఫ్రం వాల్ విషయంలో ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతుంది. వాల్ పూర్తిగా దెబ్బతిన్నదా.. లేదా అనే టెక్నాలజీ లేకపోవడం దురదృష్టకరం. ప్రజలు, మేధావులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిన్న సంఘటన లేదు. ఇదే తొలిసారి. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు, దేవినేని ఉమ అజ్ఞానం, తొందరపాటు చర్య అన్నారు. మన రాష్ట్రంలో వ్యవసాయానికి పనికొచ్చే లక్షల ఎకరాల భూమి ఉంది. ఇరిగేషన్ ద్వారా 1.04 లక్షల ఎకరాలను సాగుచేస్తున్నాం. ఇంకా మిగిలిన 94.63 లక్షల ఎకరాలు వర్షాధారంగా పండుతున్నాయి. జలయజ్ఞం కింద దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. దాని ద్వారా 31 వేల ఎకరాల పైచిలుకు భూమిని ఇరిగేషన్‌లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభించి సుమారు 8 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాం. దీనికి సుమారుగా 1,032 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం తరువాత ఆయకట్టులోని రైతాంగాన్ని సంఘం ఏర్పాటు చేసి.. నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు. వారు ఎకరానికి కొంత వసూలు చేసి ప్రాజెక్టు నిర్వహణ చూసుకుంటారు. విద్యుత్ బిల్లులను మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుంది. కొన్ని సందర్భాల్లో నిర్వహణలోపం వల్ల ప్రాజెక్టులు దెబ్బతింటాయన్నారు. వైస్సార్ జిల్లాలో ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా ఉన్న మాట పచ్చి అబద్ధం. సోమశిల నుంచి నీటిని లిఫ్ట్ చేసి.. చెరువుకు పంపించి గ్రావిటీ ద్వారా తాగునీరు, సాగునీరు అందించే ప్రాజెక్టు. ఆ చెరువు నిండిపోయింది కాబట్టే మోటార్లు ఆపారు.. చెరువు ఖాళీ అయితే మోటార్లు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎవరు ఎన్ని అబద్ధాలు రాసినా ప్రజలు నమ్మరు అంటూ పేర్కొన్నారు .