టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో మూడేళ్ళ పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌గా సేవలందించేందుకు ఎంబిబిఎస్ చదివిన అభ్యర్థులకు మే 30 న వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో ఉదయం 10 గంటలకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను ఇంటర్వ్యూకు తీసుకురావాల్సి ఉంటుంది.