రాజధాని అమరావతి పరిధిలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఏపీ టిడ్కో గృహాలను ఈ ఏడాది డిసెంబరు నాటికి సిద్దం చెయ్యాలని, లబ్దిదారులు గృహప్రశాలు జరిపి కొత్త ఇళ్లలో దిగేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు.
సీఆర్డీఏ పరిధిలో ఎనిమిది ప్రదేశాలలో 5,024 టిడ్కో గృహాలు నిర్మాణం జరుగుతుండగా పనుల పరోగతిపై సంబంధిత అధికారులతో విజయవాడ సంస్థ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టిడ్కో గృహాల నిర్మణాల పరోగతిపై అధికారులను నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రధానంగా బ్యాంకు లింకేజి మరియు రిజిస్ట్రేషన్ల పక్రియ చేపట్టాల్సిన పద్ధతులపై సమీక్షలో కమిషనర్ అధికారులతో చర్చించారు. నిర్మాణం పూర్తిచేసుకొని ముస్తాబైన గృహాలను లబ్దిదారులకు మంజూరు చేయాలని ఇందుకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించి శరవేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులు బ్యాంకు నుండి రుణాలు పొందేందుకు అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. మొత్తం 5,024 గృహాలకు రిజిస్ట్రేషన్ల క్రతువును వెంటనే ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు.
365 చదరపు అడుగుల కేటగిరీలో 992 గృహాలు ఉన్నాయి. 430 చదరపు అడుగులలో 4032 గృహాలు ఉండగా 2522 సంబంధిత లబ్దిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించినట్లు, వివిధ కారణాలు వాళ్ళ అనర్హత వున్న లబ్ధిదారులకు బ్యాంకుల వారు రుణ మంజూరు తిరస్కరించినట్లు మరియు బ్యాంకుల వారి వద్ద మంజురుకై పెండింగ్ లో వున్న లబ్ధిదారులకు మరియు ఇంకనూ అందించవలసిన లబ్ధిదారుల త్వరిత గతిన అందిచాలవాసి వున్నది అనే విషయాని అధికారులు కమిషనర్‌కు నివేదించారు. తక్కిన లబ్దదారులకు బ్యాంకు వారితో మాట్లాడి రుణాలు మంజూరు అయ్యే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు.
డిసెంబరు నాటికి ఎనిమిది ప్రదేశాలైన తుళ్లూరు, మందడం, దొండపాడు, ఐనవోలు, అనంతవరం, పెనుమాక, నవులూరు, నిడమర్రు గ్రామాల పరిధిలో ఉన్న 5,024 మంది లబ్దిదారులు గృహప్రవేశాల కార్యక్రమాలు చేసుకొని నూతన గృహాలలో ప్రవేశించటమే లక్ష్యంగా అధికారులు ముందడుగు వేయాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న సబ్-రిజిస్టార్ అధికారులు కూడా లబ్దిదారులకు, కాంపిటెంట్ అథారిటీ అధికారులకు సహకరించాలని కమిషనర్ కోరారు.