రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వార్షిక నివేదికలు అందించింది. ఎపిపిఎస్ సి అధ్యక్షుడు గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన కమీషన్ సభ్యులు 2018-2019, 2019-2020, 2020-2021 సంవత్సరాలకు చెందిన మూడు వార్షిక నివేదికలను అవిష్కరింప చేసారు.
గౌతమ్ సవాంగ్ వివిధ దశలలో ఉన్న నియామకాల ప్రక్రియ గురించి గవర్నర్ హరిచందన్ కు వివరించారు. నిబంధనల మేరకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామన్నారు. గవర్నర్ పలు సూచనలు చేస్తూ పారదర్శకత ప్రతిబింబించేలా నియామక ప్రక్రియలు ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల యువతకు ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కాలహరణం లేకుండా, నిర్ణీత కాలవ్యవధి మేరకు పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులు, రాజ్ భవన్ అధికారులు ఉన్నారు.