ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పై వ్యతిరేక త పెరిగిందని, దీంతో నకిలీ గుర్తింపుకార్డులతో వైసీపీ దొంగ ఓట్లకు కుట్ర పన్నుతోందని ఆత్మకూరు ఎన్నికల అధికారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వ్యవహారం ఆత్మకూరులో కూడా ఇదె వ్యవహారం కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ తో పాటు ఆత్మకూరు ఎన్నికల అధికారి ఎంఎన్ .హరేంద్ర ప్రసాద్ ను స్వయంగా కలసి సోము వీర్రాజు ఫిర్యాదు పత్రం అందజేశారు.
స్థానికంగా లేని వారు, చనిపోయిన వారి ఓట్లు కు సంబంధించి నకిలీ గుర్తింపు కార్డులతో వచ్చి వైసీపీ ఓట్లు వేయిస్తుందని గతంలో విధంగా జరిగిందని ఎన్నికల అధికారి కీ వివరించారు. బస్సు ల్లో యాత్రికుల్లా వచ్చి ఓట్లు వేయించిన సంఘటనలు ఉన్నాయని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై అవసరమైతే మరోసారి ఎన్నికల అధికారులు ను కలుస్తాం అన్నారు. వైసీపీకి నిజాయితీ ఉంటే డబ్బు పంచకండని డిమాండ్ చేశారు. మీకు. మంచి పేరు ఉంటే డబ్బు పంచడం ఎందుకు అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయిఅని, ఎక్కడ అభివృద్ధి లేదున్నారు. గ్రామీణ ఉపాధి నిధులను సొంతానికి సొంతంగా ప్రకటిస్తున్నారు అన్నారు. కేంద్ర నిధులతోనే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరుగుతుందని, ఈ విషయంపై డైరక్ట్ గా చర్చకు రావాలని పిలుపునిచ్చారు. యోగ్యత లేని పార్టీ మీది అన్నారు. రాష్ట్రంలో నాలుగు రకాలుగా విద్యకు వేలకోట్లు కేంద్రం నిధులు అందిస్తుందని, 20లక్షల మంది కి పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. సంక్షేమానికి కేంద్రం పెద్ద పీఠ వేస్తుంది. వైసీపీ సంక్షేమం బూటకమన్నారు. ఆత్మకూరులో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా జయప్రద ఆత్మకూరులో బీజేపీ ఏ ఛాన్సును వదిలి పెట్టకూడదని అనుకుంటోంది. చివరికి జయప్రదనూ రంగంలోకి దింపుతోంది. స్టార్ క్యాంపెయినర్‌గా ఆమెను ఆత్మకూరులోప్రచారంలోకి తిప్పాలని నిర్ణయించారు. ఇటీవల ఏపీ రాజకీయాల్లో జయప్రత క్రియాశీలకంగా మారేందుకు సిద్ధమయ్యారు. రాజమండ్రిలో బీజేపీ సభలోనూ పాల్గొన్నారు. వైఎస్ఆర్‌సీపీ పాలనపై విమర్శలు చేశారు. తున్నారు. తాను పుట్టిన గడ్డను ఎప్పటికీ మరచిపోనని చెప్పారు జయప్రద. ఇప్పుడామె ఆత్మకూరు ప్రచారానికి రాబోతున్నారు.