రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 108, 104 అంబులెన్సులు రోడ్డెక్కాయి. 2021లో డాక్టర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ .జగన్మోహన్ రెడ్డి అంబులెన్స్‌లను ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఒకేసారి 1088 (108–104 కలిపి) అంబులెన్స్ వాహనాలు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వాటి సేవలు ఆరంభం అయ్యాయి. ప్రతి మండలంలోనూ 108, 104 అంబులెన్స్ వాహనాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పట్టణాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అరగంట వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లను చేసింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించే సమయంలోనే అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్సను అందిస్తారు.
కష్టాల్లో 104 ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మెహన్ రెడ్డి ఏడాది కిందట రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రారంభించిన 108 వాహనాలు ఇప్పుడు ఆగనున్నాయి!!. 104, 108 ఉద్యోగులు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. 108 ఉద్యోగులకు జీతాలు రాకపోవడం ఇంటి అద్దెలు, ప్రతి నెల ఉండే ఈఏస్ఐలు కట్టలేక నాలా తంటాలు పడుతున్నారు. ఏపీలో 3,400 (108) అంబులెన్స్ ఉద్యోగులు, 2,400 (104) సర్వీస్ ఉద్యోగులు ఉన్నారు. 24 గంటలు పని చేస్తోన్న ఉద్యోగులకు మాత్రం సకాలంలో జీతాలు మాత్రం అందడం లేదని వాపోతున్నారు. ప్రాణాలను కాపాడేందుకు కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు ప్రతి ఏటా 40% బకాయిలు ఇస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఈ హామీలను అమలు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 104 సర్వీసు ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి కన్సల్టింగ్ డాక్టర్, మొబైల్ లాబొరేటరీతో మొబైల్ యూనిట్ 24×7 పని చేస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా 600 మంది కన్సల్టింగ్ డాక్టర్ పనిచేస్తున్నారు… వారిలో వివిధ కారణాలతో దాదాపు 57 మందిని ఇటివల తొలగించడం జరిగింది… ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది కాలంగా ఇదే పరిస్థితి నెలకొంది.. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ సర్కారు ఇప్పుడు వీరి సమస్యల పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి. ఎండైనా, వానైనా నిత్యం గ్రామాల్లో తిరుగుతూ వైద్య సేవలు అందిస్తున్నా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 104 వాహన సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. . పెరిగిన ధరలతో సామాన్యులు, పేదలు అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. 104అంబులెన్సుల కు కావాలసిన వాహన సిబ్బంది అందించడం, ప్రభుత్వ నిబంధనల మేరకు అపరేషన్ కొనసాగించడం మాత్రమే అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సంస్థ చేస్తుందని, సిబ్బంది వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం జరిగిందని ఆ సంస్థ డైరెక్టర్ చెబుతున్నారు.
అరకొర జీతాలు…ఆపై ఆలస్యం
వాస్తవానికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పేరిట కనీస వేతనం అమలు చేకుండా, సిబ్బంది కష్టాన్ని దోపిడీ చేస్తున్నాయి. అందులో భాగంగానే 104 వాహనంలో పని చేసిన సిబ్బందికి కేవలం రూ.11,000 నుంచి రూ.12,600(13200-14000) మాత్రమే చెల్లిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్లు కు అదే స్థాయిలో జీతాలు చెల్లిస్తున్నారు. . ఈ నేపథ్యంలోనే సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలు సామాన్య, మధ్యతరగతి వారిని ముప్ప తిప్పలు పెడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి , జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు..
పరిస్థితి ఇదీ…
104 వాహనాలు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, నర్సులు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. చాలీచాలని జీతమే ఇస్తున్నా ఎప్పటికైనా ఉద్యోగ భద్రత కలగపోతుందా అన్న గంపెడాశతో పనిచేస్తున్నారు. సమస్యలపై గత ప్రభుత్వ హయాంలో వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు 104 వైద్య సేవలను మెరుగుపరుస్తామని, ఉద్యోగులకు న్యాయం చేస్తామని, సుప్రీంకోర్డు తీర్పు ప్రకారం జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి రావడంతో హామీలు నెరవేరుస్తారని, తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూశారు.