లక్ష ఓట్లే రావడంతో ఆ ఆశ నెరవేరలేదు. పోలింగ్ శాతం బాగా పడిపోవడంతో పోలైన ఓట్లలో లక్ష వైసీపీకి మిగిలినవి బీజేపీతో పాటు బీఎస్పీ అభ్యర్థి పంచుకున్నారు. ఫలితంగా మెజార్టీ 82 వేల దగ్గర ఆగిపోయింది. లక్ష మెజారిటీ కోసం మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలంతా ఆత్మకూరులోనే మకాం వేసి మరీ ప్రచారం చేశారు. వైసీపీ హైకమాండ్ ఉపఎన్నిక జరగాలని లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేసింది. సాధారణ ఎన్నికల స్థాయిలో ప్రచారం చేశారు. ఓట్లు పడవు అనుకున్న చోట్ల డబ్బులు కూడా పంచారుఅని ప్రచారం జరిగింది. అయితే లక్ష్యం మాత్రం అందుకోలేదు. ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి మెజారిటీతో గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆత్మకూరు ఉపఎన్నిక మొత్తం ఫలితాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,13,338 మంది. వీరిలో ఈ నెల 23న జరిగిన పోలింగ్‌లో ఓటేసింది 1,37,081 మందే. అంటే 64 శాతం మంది ఓట్లు వేశారు. పోస్టల్ బ్యాలెట్ సహా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి మొత్తం 1,02,074 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 19,332 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థికి 4,897 ఓట్లు వచ్చాయి. ఇక ఏ అభ్యర్థి నచ్చలేదని చెప్పే నోటాకు 4,197 ఓట్లు రావడం విశేషం. ఇక ఆత్మకూరు ఉపఎన్నికలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 217 నమోదు అయ్యాయి. వీటిలో వైసీపీకి 167 ఓట్లు, బీజేపీకి 21 ఓట్లు, బీఎస్పీకి 7, ఇతరులకు మరో 10 ఓట్లు వచ్చాయి. సరిగ్గా ఓటేయని 9 ఓట్లు తిరస్కరించగా నోటాకు పోస్టల్ బ్యాలెట్‌లో 3 ఓట్లు వచ్చాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ.. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్లు లెక్కింపు కొనసాగగా.. ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు.ఆది నుంచీ ఆధిక్యంలో కొనసాగిన విక్రమ్ రెడ్డి.. 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 76,096 (పోలైన మొత్తం ఓట్లలో 50 శాతానికిపైగా) ఓట్లు దక్కించుకోవడంతో.. విజయం ఏకపక్షమని తేలిపోయింది. పోస్టల్ బ్యాలెట్ సహా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ప్రత్యర్థి భాజపా అభ్యర్థి భరత్‌కుమార్ యాదవ్‌పై 82,888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. అయితే.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,338 కాగా.. కేవలం 1,37,081 (64 శాతం) మంది మాత్రమే ఓటు వేశారు.మొత్తం 20 రౌండ్లలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు..వైకాపా : 1,02,074 , భాజపా : 19,332 , బీఎస్పీ : 4,897 , నోటా : 4,197 , పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇలా..మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు : 217 , వైకాపా : 167 , భాజపా : 21 , బీఎస్పీ : 7 , ఇతరులు : 10 , తిరస్కరించినవి : 9 , నోటా : 3
ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా… ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి… ప్రతి అవ్వకు, ప్రతి తాతకు… పేరుపేరునా ధన్యవాదాలు! (1/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2022
ఆత్మకూరు అఖండ విజయంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్..
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా 83 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్‌ని గెలిపించిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుని చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామ రక్ష అంటూ సీఎం జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీకి బ్రహ్మాండమైన మెజార్టీ : అంబటి రాంబాబు
ఆత్మకూరు ఉపఎన్నికలో ఊహించిన విధంగానే వైసీపీ ఘన విజయం సాధించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైందన్న ఆయన ఉపఎన్నికలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేశారన్నారు. టీడీపీ పోటీ చేయకపోయినా, బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేసిందని ఆరోపించారు. టీడీపీ క్యాడర్‌ను ఈ ఎన్నికలో ఉపయోగించుకున్నారన్నారు. ఏదో విధంగా వైసీపీని ఓడించాలనో, ఓట్ల శాతాన్ని తగ్గించాలనో తీవ్ర ప్రయత్నం చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీని ఆత్మకూరు ప్రజలు కట్టబెట్టారని తెలిపారు. 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతం రెడ్డి 22,276 ఓట్ల మెజార్టీతో గెలిచారన్నారు. ఈ ఉపఎన్నికలో మేకపాటి గౌతమ్ సోదరుడు విక్రమ్ రెడ్డి 74.47 శాతం ఓట్లు సాధించి, 82,888 ఓట్ల మెజార్టీతో విజయం కైవసం చేసుకున్నారన్నారు.
వైసీపీ ఓట్ల శాతం పెరుగుతోంది
రాష్ట్రంలో ఏ ఉపఎన్నిక జరిగినా, 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మెజార్టీ కన్నా చాలా గణనీయమైన మెజార్టీతో గెలుస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం కంటే ఈ ఉపఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లను వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకుందన్నారు. దీంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు.
సంక్షేమ పథకాల ఫలితమే – మంత్రి అంబటి రాంబాబు
మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ రోజూ గప్పాలు కొట్టుకునే తెలుగుదేశం పార్టీ, ఇతర ప్రతిపక్షాలు గమనించాల్సిన అంశం ఏంటంటే వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు నిరాఘాటంగా సాగుతున్నాయి. వాటి ఫలాలను అందుకుంటున్న ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెడుతున్నారు. ప్రతి ఎన్నికలోనూ మా పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ ముందుకు వెళుతోంది.
ఓట్లు పెంచుకున్న బీజేపీ
నెల్లూరు జిల్లా నెల్లూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో BJP గతంలో కంటే అధిక ఓట్లను సాధించింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 2314 ఓట్లు మాత్రమే దక్కాయి. కానీ ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ కు 19,352 ఓట్లు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న గుండెపోటుతో మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణించాడు. హైద్రాబాద్ లోని తన నివాసంలో మేకపాటి గౌతంరెడ్డి గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. దీంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ప్రజల మద్దతుతోనే భారీ మెజారిటీ: మేకపాటి విక్రంరెడ్డి
ప్రజల మద్దతుతోనే తాను భారీ మెజారిటీతో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విజయం సాధించినట్టుగా వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రంరెడ్డి చెప్పారు. ఆత్మకూరు బైపోల్ రిజల్ట్స్ 2022 విజయం సాధించిన తర్వాత ఆయన ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి పై ఉన్న అభిమానంతో ప్రజలు తనకు ఓట్లు వేశారని ఆయన చెప్పారు. ఈ గెలుపుతో తన బాధ్యత మరింత పెరిగిందని విక్రంరెడ్డి చెప్పారు. ఓటమి కారణంగానే తమపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మేకపాటి విక్రమ్ రెడ్డి మండిపడ్డారు.
ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా ఆయన చెప్పారు. విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కు 19,352 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలి రౌండ్ నుండి వైసీపీ అభ్యర్ధి విక్రం రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగారు. తన సమీప ప్రత్యర్థి భరత్ కుమార్ పై 82, 888 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.
మంత్రులు, అగ్రనేతలు ప్రచారం చేసినా ఆశించిన మెజారిటీ రాలేదు – అభ్యర్ధి భరత్
ఈ ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. మరణించిన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలిపిన సమయంలో పోటీకి నిలపకూడదని గతం నుండి వస్తున్న సంప్రదాయం మేరకు ఆత్మకూరు ఉపఎన్నికకు దూరంగా ఉన్నామని టీడీపీ నేతలు ప్రకటించారు. గతంలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీకి దూరంగా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ ఉప ఎన్నికల్లో BJP పోటీ చేసింది. బీజేపీ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు Bharath Kumar పోటీలో నిలిచారు. బీఎస్పీ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కర్నాటి ఆంజనేయ రెడ్డికి కేవలం 2314 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ దఫా పోటీ చేసిన బరత్ కుమార్ మాత్రం 19,352 దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. ఈ దఫా టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ వైసీపీ , బీజేపీ మధ్యే నెలకొంది. దీంతో బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ నేతలు కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. ఓట్లను పెంచుకున్నప్పటికీ వైసీపీకి బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్ల ఆ పార్టీ భారీ మెజారిటీని సాధించిందని కూడా కమలనాథులు ఆరోపణలు చేస్తున్నారు.గతంంలో కంటే బీజేపీ ఓట్లను పెంచుకొంది. కానీ డిపాజిట్ మాత్రం దక్కించుకోలేకపోయింది.కనీసం 22 వేల ఓట్లను బీజేపీ సాధిస్తే డిపాజిట్ దక్కి ఉంేది, కానీ బీజేపీ 19 వేల ఓట్లకు మాత్రమే పరిమితంైంది. దీంతో ఆ పార్టీ డిపాజిట్ ను దక్కించుకోలేకపోయింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైసీపీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఆత్మకూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే అధిక ఓట్లను సాధించింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 2314 ఓట్లు మాత్రమే దక్కాయి. కానీ ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ కు 19,352 ఓట్లు సాధించాడు.
భాజపా ప్రధాన కార్యదర్శి : ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
ఆత్మకూరులో లక్ష ఓట్ల మెజారిటీ ఏమైంది అంబటి గారు అంటూ భాజపా ప్రధాన కార్యదర్శి, ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి అంబటి రాంబాబు ఉద్దేశించి మీ జిల్లా ఇన్చార్జి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో చూసుకోండి అని ఎద్దేవా చేశారు. మా గురించి ఆలోచించడం మానేసి, కూలిపోబోతున్న మీ పీఠాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దానిపై ఆలోచన సారించండి అంబటి రాంబాబూ గారూ ! భారతీయ జనతా పార్టీకి, జనసేనకు ఉన్న సంబంధం గురించి అసలు మీకు మాట్లాడే హక్కుందా?
పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తారో, రారో అది మా రెండు పార్టీలకు సంబంధించిన విషయం ! మా రెండు పార్టీల రాజకీయ వ్యూహాల గురించి మీకెందుకు అంబటి ? మా రాజకీయ , ఎప్పుడు ఎలా చేయాలో , దేశంలో చాలా రాష్ట్రాల్లో చూస్తున్నారు కదా .మీ వంతు ఎంతో దూరంలో లేదు . ఆ పని రాష్ట్ర ప్రజలతో కలసి చేసి చూపిస్తాం . తొందరేం లేదు ముందుంది ముసళ్ళ పండగ . బిజెపి, జనసేన పార్టీలకు ఉన్న బంధం గురించి మాలో మాకు లేని అనుమానం మీకెందుకు . మీరు ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలకు తెరలేపినా, పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి, వాలంటీర్లను అడ్డం పెట్టుకొని ఓటర్లను బెదిరించి పోలింగ్ శాతం తగ్గేలా చేసినా భారతీయ జనతా పార్టీకి 19,332 ఓట్లు వచ్చాయి. *ఇదే ఆత్మకూరులో బిజెపికి వచ్చిన ఓట్లు 2 వేల నుండి 20 వేలకు పెరిగాయి. *
కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఓట్లు మెజారిటీ అన్నారు, మరి బద్వేలులో వచ్చిన మెజారిటీ కంటే ఇక్కడ ఎందుకు తగ్గినట్లు? మీ మీద ప్రజలకు పెద్ద ఎత్తున ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనం!!ఒక్క నియోజకవర్గంలోనే మీ పట్ల ఇంత వ్యతిరేకత ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత వ్యతిరేకత ఉందో ముందు ముందు మీకే అర్థం అవుతుంది. ప్రజలే తమ ఓట్ల రూపంలో మీకు గట్టి సమాధానం చెప్పే రోజులు దగ్గర్లో ఉంది జాగ్రత్త !
సానుభూతి కోణంలో అందరూ వదిలేస్తే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు – నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం
ఆత్మకూరు ఉప ఎన్నికలో తెలుగుదేశం, జనసేన పోటీ చేయకపోవడం వల్లే వైస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించారు అన్నారు.బీజేపీ అభ్యర్థి అసలు పోటీనే కాదని అన్నారు. బీజేపీకి వైసీపీకి బలమైన బంధం ఉంది అనే విషయం రాష్ట్రపతి ఎన్నికల్లో నిరూపితమైంది అన్నారు.ఆత్మకూరులో బీజేపీ నుండి డమ్మీ అభ్యర్థి ని కావాలని బరిలోకి దించారని, బద్వేలు, తిరుపతి ఉపఎన్నికల్లో కూడా ఇదే విధానాన్ని బీజేపీ వైసీపీ అవలంభించాయన్నారు. రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ పడే బీజేపీ వైస్సార్ సీపీ పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలో ఎందుకు పోటీ పడలేదు అనే విషయాన్ని గమనించాలి అన్నారు.మోడీ శిష్యుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి అని అందుకే రాష్ట్రం లో మోడీ డైరెక్షన్లో జగన్ నడుస్తున్నారన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం ఘనవిజయం అని చెప్పుకోవాలి అంటే లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తాం అని పలికిన ప్రగల్భాలు గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు.ఈ వృక్షం లేని చోట ఆముదం వృక్షమే మహా వృక్షం గా కనిపిస్తుంది అని ఆత్మకూరు లో విక్రమ్ రెడ్డి విజయం కూడా అలాంటిదే అని రావుసుబ్రహ్మణ్యం అన్నారు. ఈ ఎన్నిక 2024 సాధారణ ఎన్నికలకు రెఫరెండం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు.