వారంలో పెద్ద కుంభకోణమంట ఏమై ఉంటుంది.లోకేష్ ముందే ప్రకటించాడు అంటే ఏదో పెద్దదే అయి ఉంటుంది,అది ఏమై ఉంటుంది. ఇదే చర్చ ఇప్పుడు ఫుల్లు నడుస్తోంది. కుంభకోణాలకు కరువేమీ లేదు. అలాంటిది ప్రత్యేకంగా చెప్పాడంటే అది ఏమై ఉంటుంది. అది భూములకు సంబంధించిందే అయి ఉంటుందని కొందరి అభిప్రాయం. ఎందుకంటే భూముల విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే అయి ఉంటుందని వారి అంచనా,ఇప్పటికే ఇసుక కుంభకోణం చూశాం. స్ధల సేకరణకు చేసిన ఆవభూములు లాంటి కుంభకోణం చూశాం రాజధాని పేరు చెప్పి విశాఖలో భూకుంభకోణం చూశాం ఇవన్నీ కాకుండా ఇంకా పెద్ద కుంభకోణం ఏమై ఉంటుంది అని టీడీపీ శ్రేణులు కూడా ఆలోచిస్తున్నారు.అయితే లోకేష్ ఈ విషయం చెప్పినప్పుడు ఓ మాట అన్నారు. గతంలో జైలుకెళ్లొచ్చినా జగన్ కు అవే బుద్ధులు అవే పనులు అని అన్నారు. అంటే క్విడ్ ప్రోకో లాంటిదే మరోటి చేశారన్నమాట అనేది బాగా వినపడుతుంది. ఎక్కడో ఎవరికో ఏవో కేటాయించి వారి నుంచి వీరి కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టించుకునే కార్యక్రమం నడిచిందని అనుకుంటున్నారు.
అది అదానీయో, అంబానీయో అయి ఉంటారని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే అదానీకి కృష్ణపట్నం పోర్టు, ఇంకా మరికొన్ని అప్పనంగా కేటాయించేశారు. అలాగే అంబానీకి కూడా అలాంటి మేలే చేశారని వినిపిస్తోంది.అదానీ, అంబానీలు జగన్ కు లేదా జగన్ సన్నిహితులకు చెందిన సూట్ కేసు కంపెనీల్లో ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టి ఉంటారని ఆ వివరాలే లోకేష్ బయటపెడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు గాని లోకేష్ వారం తర్వాత పెద్ద కుంభకోణం అనడంతో ఎవరికి వారు తమకు తోచినట్లు ఊహించుకుంటున్నారు. మొత్తం మీద లోకేష్ స్ట్రాటజీ వర్కవుట్ అయింది. వారం తర్వాత అంటూ ముందే ప్రకటించడంతో అందరి అటెన్షన్ వచ్చేసింది. అందరూ ఇప్పుడు అదేంటది అంటూ ఆరా తీస్తున్నారు.ఒకవేళ ఇంత చర్చ జరిగాక లోకేష్ కనుక సరైన కుంభకోణం బయటపెట్టకపోతే అది లోకేష్ ఇమేజ్ నే దెబ్బ తీస్తుంది. ఇంత హైప్ క్రియేట్ చేశాక ఆ రేంజులో కుంభకోణం లేకపోతే గాలి పోతుందనడంలో సందేహం లేదు. ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటారా లోకేష్, ఆలోచించే ఈ ప్రకటన చేసి ఉంటారని టీడీపీ నేతలు సమర్ధించుకుంటున్నారు. వారం ఆగండి మీరే చూస్తారు కదా అంటూ భరోసా ఇస్తున్నారు.