శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన వైయస్సార్ ఉచిత బీమా పుణ్యమా అని ఓ ప్రభుత్వ వాలంటీర్ తన చెప్పుతో తానే కొట్టుకునే విధంగా తయారయింది ప్రస్తుత పరిస్థితి . ఆ వివరాలు ఏందో ఒకసారి చూడండి ..
సత్యసాయి జిల్లా కదిరి మండలం రామదాస్ నాయక్ తండాలో 50 మంది రైతులు తమ వాలంటీర్ నాగేష్ నాయక్ సూచన మేరకు ఈ క్రాప్ బుకింగ్ చేయించారు. అయితే వాలంటీర్ నగేష్ నాయక్ 50 మంది రైతులకి ఈ క్రాప్ బుకింగ్ చేయిస్తే ఒక్క రైతుకు మాత్రమే పంటల బీమా వచ్చింది. దీంతో మిగిలిన గ్రామస్తులందరూ వాలంటీర్ నాగేష్ నాయక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా నువ్వేమైనా బీమా డబ్బులు గోల్మాల్ చేశావంటూ అగ్ర చేస్తున్నారని వాలంటీర్ నాగేష్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చివరకు తన సమస్య సచివాలయ సిబ్బందికి వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపాడు వారు కూడా తామేమీ చేయలేమని చేతులెత్తేయడంతో ఈ వాలంటరీ ఉద్యోగం చేస్తున్నందుకు తన చెప్పుతో నేను కొట్టుకోవాలి అంటూ కొట్టుకోవడమే కాకుండా వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అధికారులవద్ద మొర పెట్టుకుంటున్నాడు.
కదిరిలో ఓ వాలంటీర్ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. నగేష్ నాయక్ అనే వాలంటీర్ రాందాస్ తాండ గ్రామంలో వాలంటీర్ గా పని చేస్తున్నాడు. పంట నష్టపరిహారం చెల్లింపులో ఎర్ర దొడ్డి పంచాయతీ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వ తీరుకు నిరసనగా నగేష్ నాయక్ రాందాస్ తాండ గ్రామ వాలంటీర్ గా రాజీనామా చేశాడు..కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి పంచాయతీ రైతులకు పంట నష్టపరిహారం అందించే విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని సిబ్బందిని లోపలే ఉంచి సచివాలయానికి తాళం వేసి రైతులు నిరసన తెలిపారు. తన క్లస్టర్ పరిధిలో 50 మంది రైతులకు ఈ క్రాప్ బుకింగ్ చేసినా అనర్హులైన ఒక కుటుంబానికి తప్ప 49 మంది రైతులకు పంటల బీమా నష్టపరిహారం అందలేదని గ్రామ వలంటీర్ నగేష్ నాయక్ ఆరోపించారు. గత మూడు సంవత్సరాలుగా తమ కుటుంబానికి సైతం పంటల బీమా రాలేదని ఎర్రదొడ్డి పంచాయతీలో రైతులు ఆవేదన చెందారు. పంచాయతీ పరిధిలోని 1200 మంది రైతులు E-crop బుకింగ్ చేసుకున్నా, కేవలం 44 మంది రైతులకు మాత్రమే పంటల బీమా వర్తించిందని విమర్శించారు. అందులో ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.