ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరీ మృతి పై వైసీపీ ఎంపీ చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. వైసీపీకి టీడీపీ మధ్య జరుగుతున్న రాజ్యకీయాల్లో ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారం కూడా కలిసిపోయింది. జగన్ దగ్గర మార్కులు కొట్టేయడానికి విజయసాయి రెడ్డి తెగ ట్రై చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఉమామహేశ్వరి ఈ దారుణానికి పాల్పడిందంటూ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ లో అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోల్ ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె హత్యకు గల కారణాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసి సంచలన చర్చకు తెర తీశారు. ఇక ఈ ట్వీట్ లో చంద్రబాబును లాగారు. అసలు ఉమా మహేశ్వరీ ఎందుకు చనిపోయారు. ఎలాంటి కారణాలు ఉండి ఉంటాయి అనే విషయంపై చర్చ జరుగుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.
“మినిస్టర్స్ తో సహా కొంతమంది వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయిరెడ్డి ఇలాంటి అసాంఘిక విమర్శలకు దిగుతున్నారు. సీఎం జగన్ కనుసన్నల్లో పడడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడుతున్నారు’’ అని టీడీపీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని మీడియాకు తెలిపారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో దారుణంగా ప్రచారం చేస్తున్నప్పటికీ టీడీపీ నేతలు క్రమశిక్షణతో ఉన్నారా అని అన్నారు. వైఎస్సార్ సీపీ నేతలలా మేం ఎప్పటికీ దిగజారబోము. చంద్రబాబునాయుడుపై ఇలాంటి ‘అనైతిక’ సోషల్ మీడియా పోస్ట్‌లకు దూరంగా ఉండాలని టీడీపీ నాయకుడు విజయ సాయి రెడ్డిని హెచ్చరించాడు. “పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ శ్రేణుల నుంచి ఎం.ఎస్.బాబుకు వ్యతిరేక త ఉంది. 2024 ఎన్నికల్లో తనకు టిక్కెట్ వస్తుందని ఆశతో చంద్రబాబు నాయుడు, లోకేష్‌పై కూడా చౌకబారు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని నాని అన్నారు.
ఉమామహేశ్వరి మరణంపై అనుమాలున్నాయి. మా చంద్రన్న వేధించాడా? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా? ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదు. CBI దర్యాప్తు కోరి నిజం నిజం నిగ్గు తేల్చాలి బాబన్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 3, 2022