2018 భీమా కోరేగావ్ హింసాకాండ కేసులో నిందితుడు, వైద్య కారణాలతో శాశ్వత మెడికల్ బెయిల్‌ను కోరిన ఉద్యమకారుడు మరియు కవి డాక్టర్ పి వరవరరావుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసును జులై 19కి కోర్టు వాయిదా వేసింది. ఈ విషయంలో శాశ్వత మెడికల్ బెయిల్ కోసం తాను చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ బాంబే హైకోర్టు ఏప్రిల్ 13న ఇచ్చిన ఉత్తర్వులను రావు సవాలు చేశారు. అయితే క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకునేందుకు వీలుగా తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి రావుకు కోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది.
హైకోర్టు ఉత్తర్వుపై దాఖలు చేసిన పిటిషన్లో, “పిటిషనర్ 83 ఏళ్ల ప్రఖ్యాత తెలుగు కవి మరియు వ్యాఖ్యాత, అతను కింద విచారణలో రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు, మరియు ప్రస్తుతం బొంబాయి హైకోర్టు వైద్య అవసరాల నిమిత్తం బెయిల్ పొడిగించబడింది, ఇప్పుడు మరల నిర్భందం విధించడం అంటే ఆయన పెరుగుతున్న వయస్సు, అనారోగ్యం దృష్ట్యా ఆయన ప్రాణాలకు ప్రమాదం రావొచ్చు.”అని పేర్కొన్నారు. వరవరరావు గారు భీమా కోరేగావ్ కేసులో ఆగష్టు 28, 2018న హైదరాబాద్ లో తన నివాసంలో అరెస్టయ్యారు. దీని కోసం జనవరి 2018 లో భారతీయ శిక్షాస్మృతి మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టంలోని ( UAPA) వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొలుత వరవరరావు గారిని గృహనిర్బంధంలో ఉంచారు మరియు నవంబర్ 2018లో పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత తలోజా జైలుకు తరలించారు.ఫిబ్రవరి 2021లో బాంబే హైకోర్టు అతనికి వైద్య కారణాలపై బెయిల్ మంజూరు చేసింది మరియు ఆ తర్వాత 2021 మార్చి 6న జైలు నుండి విడుదలయ్యారు.