జనసేన సీనియర్ నేత, మాజీ స్పికర్ నాదెండ్ల మనోహర్, వంగవీటి రాధాకృష్ణ కలయిక రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తి రేపింది. రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో.. వంగవీటి రాధాకృష్ణ జనసేనలోకి వెళ్తున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై వంగవీటి రాధ క్లారిటీ ఇచ్చారు.
మా ఆఫీస్ పక్కనే జనసేన ఆదివారం సమావేశం పెట్టుకున్నారు. ఈరోజు నాదెండ్ల మనోహర్ అక్కడికి వచ్చారు. పక్కనే ఉన్న మా కార్యాలయానికి మనోహర్ వచ్చారు. టీ తాగుతూ కాసేపు మాట్లాడుకున్నాం. రాజకీయ పరిణామాలు ఏమీ లేవు. సరదాగా చాలా మాట్లాడుకున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నాకు తెలియదు. మీడియా లేనిపోని హడావుడి చేయకండి. టీ తాగడానికి మాత్రమే వచ్చారు. కలిసి తాగాం” అని వంగవీటి రాధ అన్నారు.
వంగవీటి రాధాకృష్ణతో భేటీపై అటు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా క్లారిటీ ఇచ్చారు. ”జనసేన జనవాణి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించాను. పక్కనే రాధe ఆఫీసు ఉండటంతో ఇక్కడకి వచ్చాను. రాధాను మర్యాద పూర్వకంగా కలిశాను. మా మధ్య ఎటువంటి రాజకీయ చర్చలు లేవు. టీ తాగి, కాసేపు కుశల సమాచారాలు మాట్లాడుకున్నాం. కరెంట్ ఎఫైర్స్ కాదు.. కరెంటు ఛార్జీలు గురించి చర్చించాం” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
విజయవాడ ఎన్బీవీకే భవన్‌లో జనసేన.. పార్టీ తరఫున జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి నాదెండ్ల మనోహర్ అక్కడికి వెళ్లారు. అనంతరం అదే ప్రాంతంలో గల వంగవీటి రాధా కార్యాలయానికి వెళ్లారు. ఆయనతో సమావేశం అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. టీడీపీ-జనసేన పొత్తు అంశం సైతం వారిద్దరి మధ్య చర్చకు వచ్చిందని చెబుతున్నారు.
ఇదివరకు వైఎస్ఆర్సీపీలో ఉన్న వంగవీటి రాధా ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. తెలుగుదేశంలో చేరారు. ప్రారంభంలో పార్టీ కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ మధ్య కాస్త దూరంగా ఉంటూ వస్తోన్నారు. ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడులోనూ పెద్దగా కనిపించలేదాయన. టీడీపీలో క్రియాశీలకంగా ఉండట్లేదని, దీనికి కారణం- పార్టీ ఫిరాయించాలనే ఆలోచనలో చేయడమేనని తెలుస్తోంది.
జనసేన అధినేత వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తున్న పవన్, తాజాగా ప్రజాసమస్యలను స్వీకరించేందుకు ‘జనవాణి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ సామాన్యుడి గళం వినిపించేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలిపేలా జనవాణి కార్యక్రమం ఉంటుందని.. జులై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం వేదికంగా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ అర్జీలపై జనసేన కార్యాలయం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుందని తెలిపారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుంది.. తొలి రెండు వారాలు మాత్రం విజయవాడలోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలో మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజా సమస్యలు నేరుగా వింటూ వాటి పరిష్కారానికి కృషి చేసేవారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో సామాన్యుడికి అర్జీలు ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు.
JanaSena Party @JanaSenaParty
సామాన్యుడి గళం వినిపించేలా “జనవాణి జనసేన భరోసా” కార్యక్రమం జులై 3న ప్రారంభం. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు..
(https://twitter.com/