వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నూతన ప్రాంగణం – ‘‘వాణిజ్య భవన్’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022లో జూన్ 23 నాడు ఉదయం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కొత్త పోర్టల్ ‘‘నిర్యాత్’’ (నేశనల్ ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ రెకార్డ్ ఫార్ ఇయర్లీ అనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ కు సక్షిప్త రూపం ఇది)ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. భారతదేశం యొక్క విదేశీ వ్యాపారానికి సంబంధించిన అవసరమైన సమాచారాన్ని అంతటినీ సంబంధిత వర్గాలకు అందించడం కోసం ఒక వేదికగా ఈ పోర్టల్ ను అభివృద్ధి చేశారు. ఈ సందర్భంలో సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.
ఇండియాగేట్ కు సమీపంలో నిర్మించిన వాణిజ్య భవనాన్ని శక్తి ని ఆదా చేయడం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ ను తీసుకొని మరీ ఈ సుస్థిర వాస్తుశాస్త్ర సూత్రాల ను అనుసరించి ఒక స్మార్ట్ బిల్డింగ్ గా తీర్చిదిద్దడం జరిగింది. ఏకీకృతమైనటువంటి మరియు అధునాతన కార్యాలయ భవన సముదాయం గా ఇది సేవల ను అందించనుంది. ఈ కార్యాలయ భవన సముదాయం సేవల ను మంత్రిత్వ శాఖ పరిధి లోని రెండు విభాగాలు వాణిజ్య విభాగం, డిపార్ట్ మెంట్ ఫర్ ప్రొమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) లు ఉపయోగించుకోనున్నాయి.