కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో వర్షాలు ముమ్మరించి సీజనల్ వ్యాధుల ముప్పు పెరుగుతోంది. పలు రకాల విషజ్వరాలు జోరందుకుంటున్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక వైరల్ ఇన్‌ఫెక్షన్లు దాదాపుగా ఒకే రకమైన వ్యాధి లక్షణాలు కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు కొవిడ్‌గా భావించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితుల నేపథ్యంలో జనసమ్మర్దం అధికంగా ఉండేచోట్ల విషజ్వరాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. కొవిడ్‌ను, సాధారణ విషజ్వరాలను వేర్వేరుగా గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముంది. ఈ విషయంలో వైద్యులతోపాటు ప్రజల్లోనూ అవగాహన పెరగాలి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో విష జ్వరాలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. విషజ్వరాలు విజృంభించడంతో పిల్లలు, పెద్దలు, వృద్ధులు విషజ్వరాల బారినపడుతున్నారు. సీజనల్ జ్వరాలతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. దగ్గు, జలుబు, ఆయాసం, తలనొప్పి, ఒంటి నొప్పులతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తున్న నేపథ్యంలో జ్వరమొస్తే కరోనానేమో అనే భయంతో వణికిపోతున్నారు. ఒమెక్రాన్ ప్రారంభ లక్షణాలకు పోలి ఉండడంతో ప్రజలు భయం భ్రాంతులకు గురైతున్నారు. ఇటీ వల అకాల వర్షాలు, చలిగాలులు, వాతావరణంలో మార్పులతో వైరల్ జ్వరాలు సోకుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
బటన్ నొక్కి డయేరియా, విషజ్వరాలు తగ్గించేస్తారా ? : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నప్పటికీ జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు – – జగన్ రెడ్డి గారు మీరు పంపే ఫ్యామిలీ డాక్టర్ వచ్చేలోగా జనాలు బతికేలా లేరు – సాక్షి రాతల మాయా ప్రపంచం నుంచి బయటికొచ్చి వాస్తవం చూస్తే తేంపల్లిలో మరణ మృదంగం కనిపిస్తుంది – విషజ్వరాలతో వారం రోజుల్లో ఆరుగురు మృతి చెందారు – వాంతులు, విరేచనాలతో 70 మంది తీవ్ర అస్వస్థతకి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మాటల ముఖ్యమంత్రి, ప్రకటనల ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి ?
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030నాటికి మలేరియాను 90శాతం తగ్గించే ప్రణాళికను చేపట్టింది. కేవలం మందులు వెదజల్లడం వంటి ప్రక్రియల ద్వారానే కాకుండా నూతన సమగ్ర విధానాల ద్వారా పరిసరాలు, వ్యక్తిగత పరిరక్షణకు సైతం అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని మలేరియా ప్రభావిత దేశాలు గుర్తుచేశాయి. మందకొడిగా సాగుతున్న మలేరియా టీకా పరిశోధనలు కొన్ని దేశాలకే పరిమితమయ్యాయి. వర్షాలు, వరదల వల్ల విజృంభించే లెప్టోస్పిరోసిస్ వ్యాధి ఎలుకలు, మేకలు, పందుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాలేయం, మూత్రపిండాలు పాడై, మరణించే పరిస్థితి నెలకొంటుంది. ఏటా లక్షమందికిపైగా దీనిబారిన పడుతున్నారు. చాపకింద నీరులా విస్తరించే టైఫాయిడ్‌కు చక్కని ఔషధాలు అందుబాటులో ఉన్నా ఏటా రెండులక్షల మందికిపైగా దీని బారినపడి ప్రాణాలు వదులుతున్నారు. మనదేశంలో ఏడాది పొడవునా టైఫాయిడ్ సాధారణ వ్యాధిలా కనబడినా, వర్షాకాలంలో అధికంగా వ్యాప్తి చెందుతోంది. విషజ్వరాలను గుర్తించే అనేక రక్త పరీక్షలు కొన్నిసార్లు విఫలమవుతుంటాయి. అందుకని, వాటి ఆధారంగానే రోగ నిర్ధారణ సాధ్యం కాదు. కొన్ని రకాల పరీక్షలు పెద్ద నగరాలలోసైతం అందుబాటులో లేవు. అందువల్ల వ్యాధి నిర్ధారణలో జాప్యం కూడా అశనిపాతంలా మారుతోంది. వర్షాకాలంలో అనేకమంది దోమ కాటుతో ప్రబలే చికున్‌గన్యా జ్వరంతో పాటు, కీళ్ల వ్యాధుల బారిన పడుతున్నారు. బ్రుసెల్లోసిస్ వంటి జ్వరాలు కూడా ఈ సీజన్‌లో అధికంగా వస్తాయి. సరైన వ్యాధి నిర్ధారణ జరగకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా మారే ప్రమాదముంది.