Connect with us

Hi, what are you looking for?

Andhra News

తిరుపతి నగరంలో ట్రాఫిక్ మళ్లింపు

తిరుప‌తిలో  రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై  శ్రీనివాస సేతు (గరుడ వారధి) ప్రాజెక్టు పనుల నిమిత్తం వాహనాల దారి మళ్లింపు చేయడం జరిగుతుంద‌ని  జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్  ఒక ప్రకటనలో తెలియపరిచారు…

Share

తిరుప‌తిలో  రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై  శ్రీనివాస సేతు (గరుడ వారధి) ప్రాజెక్టు పనుల నిమిత్తం వాహనాల దారి మళ్లింపు చేయడం జరిగుతుంద‌ని  జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్  ఒక ప్రకటనలో తెలియపరిచారు. తిరుపతి పట్టణం యందు రామానుజం సర్కల్ నుండి పూర్ణకుంబమ్ సర్కల్ మధ్య Railway over Bridge (ROB) నిర్మాణ పనులు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి అని… ఈ నేప‌ధ్యంలో   RTC సెంట్రల్ బస్ స్టాండ్ వైపుకు వచ్చు  వాహనాలు అలాగే RTC సెంట్రల్ బస్ స్టాండ్ వైపు నుండి బయట వైపుకు వెళ్ళు వాహనాలు తాత్కాలికంగా  వాహనాల మళ్లింపు చేయడం జరిగింద‌న్నారు.

ట్రాఫిక్ మళ్లింపు వివరాలు 

హైదరాబాదు, కర్నూల్, కడప, వాహనాలు కరకంబాడి మీదుగా, నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూర్ మరియు చెన్నై నుండి వచ్చు వాహనాలు రేణిగుంట, రామనవిలాస్ సర్కిల్,  కరకంబాడి, మంగళం లీలమహల్ మీదుగా మళ్ళి౦పబడుతుంది (లేదా) గాజులమండ్యం జంక్షన్, ఆర్.సి పురము జంక్షన్, రామానుజపల్లి చెక్ పోస్ట్, మహిళా యునివర్సిటి, బాలాజి కాలనీ, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా మళ్ళి౦చడం జరిగింది.
పల్లెవెలుగు RTC బస్సులు రేణిగుంట మీదుగా నారాయణాద్రి హాస్పిటల్, తిరుచానూర్ ఫ్లై ఓవర్, ఆర్.సి పురము జంక్షన్, MR పల్లి పోలీసు స్టేషన్, అన్నమయ్య, వెస్ట్ చర్చ్ , బాలాజి కాలనీ, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా RTC బస్ స్టాండ్ లోకి  మళ్ళి౦చడం జరిగింది.
బెంగళూరు, చిత్తూర్ నుండి వచ్చు RTC బస్సులు రామానుజపల్లి చెక్ పోస్ట్ వద్ద నుండి  శ్రీపద్మావతి మహిళా యునివర్సిటి, అలిపిరి, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా మళ్ళి౦పబడుతాయి (లేదా) చంద్రగిరి టౌన్, చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా RTC బస్ స్టాండ్ లోకి  మళ్ళి౦చడం జరిగింది. మదనపల్లి, పీలేరు, రాయచోటి, అనంతపురము నుండి వచ్చు RTC బస్సులు చెర్లోపల్లి సర్కల్, బాలాజి కాలనీ, అలిపిరి, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా RTC బస్ స్టాండ్ లోకి  మళ్ళి౦పబడుతుంది (లేదా)  చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కల్, శ్రీనివాస సేతు మీదుగా RTC బస్ స్టాండ్ లోకి  మళ్ళి౦చడం జరిగింది. లైట్ మోటార్ వాహనాలు బస్ స్టాండ్ నుండి రేణిగుంటకు మరియు రామానుజం, లక్ష్మిపురం సర్కల్ వైపు DBR హాస్పిటల్ మీదుగా హీరో హోండా షోరూమ్ వద్ద Railway level cross, దాటుకొని వెళ్లవచ్చు (Railway level cross) ఉన్నందున వాహనదారులు గమనించగలరు.) అత్యవసర వాహనాలు అంబులెన్స్/మెడికల్, ప్రభుత్వ వాహనాలకు, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు కారణంగా అందరు సహకరించాలని అలాగే ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలు, విద్యా సంస్థలు తమ విద్యార్థుల రవాణా సౌకర్యార్థం అనువైన మార్గంను యెంచుకొని పై మళ్లింపు విషయాన్ని గమనించి ప్రత్యామ మార్గాలను ఎన్నుకొని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తిరుపతి ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్  కొరారు..

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Beşiktaş su kaçak tespiti Beşiktaş’ta Su Kaçağı Tespiti ve Onarımı Kameralı Su Kaçağı Tespiti ve Onarımı Beşiktaş’ta su kaçağı tespiti ve onarımı firmamız tarafından...

Lingual Support by India Fascinates