2021-22 కోసం ఆదాయ పన్ను రిటర్న్ (ITR 2021-22) ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31, 2022. ఇది తరచుగా ఇబ్బందికరమైన పనిగా పరిగణించబడుతుంది. అయితే, పెనాల్టీని తప్పించుకోవడానికి ఐటీఆర్(ITR) ఫైల్ చేయడం తప్పనిసరి. మీరు ఏ పన్ను స్లాబ్ కిందకు రాకపోయినా, రిటర్న్‌ను ఫైల్ చేసినట్లు నిర్ధారించుకోండి. అయినప్పటికీ, కొన్ని అధిక-విలువ లావాదేవీలను ITRలో ప్రకటించవలసి ఉంటుంది. ఈ లావాదేవీలు ఆదాయ పన్ను (I-T) విభాగం నుండి ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తాయి. అటువంటి లావాదేవీలను ఇక్కడ చూడండి…
నగదు ఉపసంహరణ / డిపాజిట్ (Cash withdrawal/ deposit)
ఏదైనా పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణ ఐటి విభాగానికి తెలియజేయాలి. అటువంటి లావాదేవీ మొత్తంగా లేదా ఒకేసారి జరిగిందని కూడా పేర్కొనాలి. కరెంట్ ఖాతాకు ఈ పరిమితిని రూ. 50 లక్షలుగా ఐటీ శాఖ నిర్ణయించింది.
ఫిక్స్డ్ డిపాజిట్లు (FDs)
ఒక వ్యక్తి యొక్క మొత్తం FDలు రూ. 10 లక్షలు దాటితే, అది తప్పనిసరిగా ITR లో ప్రకటించాలి.
విదేశీ ధనం
పన్ను చెల్లింపుదారులకు రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విదేశీ కరెన్సీ వస్తే ఆదాయపు పన్ను రిటర్న్‌లలో తప్పనిసరిగా బహిర్గతం చేయాలి.
స్థిరాస్తి అమ్మకం/కొనుగోలు
విక్రయించిన/కొనుగోలు చేసిన ఆస్తి విలువ రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఉంటే, దానిని తప్పనిసరిగా I-T విభాగానికి నివేదించాలి. ఇటువంటి లావాదేవీలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT)కి ఆస్తి రిజిస్ట్రార్‌ల ద్వారా తెలియజేయబడతాయి.
షేర్లు/బాండ్లు/మ్యూచువల్ ఫండ్స్
ఒక ఆర్థిక సంవత్సరంలో షేర్లు, స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు లేదా బాండ్ల కొనుగోలు విలువ రూ. 10 లక్షలకు మించి ఉంటే, వాటిని తప్పనిసరిగా I-T విభాగానికి నివేదించాలి. అటువంటి స్టాక్‌లు, బాండ్‌లు మరియు మ్యూచువల్ ఫండ్‌లను జారీ చేసేవారు కూడా అటువంటి లావాదేవీల గురించి సమాచారాన్ని CBDTకి పంపుతారు.
