వరుస డిజాస్టర్ల తర్వాత మళ్లీ థియేటర్లు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ అయిపోయింది. రిలీజ్ సినిమాలను ప్రమోట్ చేయడానికి దాదాపు అందరూ ట్వీట్లు చేస్తున్నారు.. ఈ సినిమా బాగుంది చూడండి.. ఆ సినిమా బాగుంది చూడండి అని. ఇన్నాళ్ల నుంచి మంచి సినిమాలు చూడక ముఖం వాచిపోయిన ప్రేక్షకులకు ఈరోజు ఫుల్ మీల్స్ అందాయి. థియేటర్స్ కూడా నిండాయి. ఇవన్నీ చూస్తుంటే టాలీవుడ్ కి మంచి రోజులు వచ్చాయనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ఐన బింబిసార, సీతారామం చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఐతే ఈ రెండు మూవీస్ లోకి సీతారామం సూపర్ హిట్ టాక్ అందుకోగా, బింబిసార పర్లేదనిపించింది. రెండు సినిమాలు కూడా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో మంచి రిజల్ట్ ని సొంతం చేసుకున్నాయి. కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా అద్భుతంగా నటించాడని.. కొత్త డైరెక్టర్ వశిష్ఠ బాగా మూవీని తీసాడనే టాక్ నడుస్తోంది. ఈ చిత్రం అమెరికా ప్రిమియర్ వసూళ్ల రిపోర్ట్స్ అందాయి. అక్కడ దాదాపు 100 లోకేషన్స్‌లో విడుదలైన ఈ సినిమాకు 35,195 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 28 లక్షలు వసూలు చేసింది.
ఇక సీతారామం కూడా సూపర్ లవ్ స్టోరీ అని టాక్ వచ్చేసింది. ఈ మూవీ చూసిన ప్రేక్షకులు అద్భుతం అని రివ్యూ ఇస్తున్నారు. మహానటి సినిమాలో జెమిని గణేశన్‌గా ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్ ఇందులో హీరోగా నటించాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, పడిపడి లేచే మనసు వంటి మూవీస్ తీసిన హను రాఘవపూడి దీన్ని తెరకెక్కించారు. ఆయన స్టైల్‌కి తగినట్లుగానే సినిమా కూడా మనసులు తాకేలా ఉందన్న రిపోర్ట్ వచ్చింది. ఇక ఈ మూవీ USA ప్రీమియర్ కలెక్షన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది.
దాదాపు 182 లొకేషన్స్లో రిలీజైన ఈ సినిమా 43 లక్షల 23 వేల వరకు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన “సీతారామం” మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హీరో దుల్కర్ సల్మాన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ ఈ మూవీకి హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ఈ వీకెండ్ వచ్చిన టు మూవీస్ కూడా హిట్ టాక్ సంపాదించుకున్నాయి.