‘ది వారియర్’ మూవీ ఇప్పుడు ఆడియన్స్ లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రామ్ పోతినేని, కృతిశెట్టి హీరో, హీరోయిన్లుగా ఆది పినిశెట్టి విలన్‌గా రాబోతున్న మూవీ ఇది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా అత్యధిక థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ మూవీలో రామ్ తొలిసారి పోలీస్ రోల్ లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుల్లెట్ సాంగ్ తెలుగు, తమిళ వెర్షన్ కలిపి 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సంచలనం రేపింది.
ఎన్ని థియేటర్స్ లో విడుదల కాబోతోంది
ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతోంది. తెలంగాణలో 250 పైగా థియేటర్స్ లో రాయలసీమ (సీడెడ్)లో 145 , ఆంధ్రప్రదేశ్ 300, తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి 700 పైగా స్క్రీన్స్‌లో విడుదల కాబోతంది. కర్ణాటక, రెస్టాఫ్ భారత్ , తమిళనాడు కలిపి 230 పైగా స్క్రీన్స్‌లో, ఓవర్సీస్లో 350 పైగా స్క్రీన్స్‌లో విడుదలకు సిద్ధమౌతోంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 1280 పైగా స్క్రీన్స్‌లో ’ది వారియర్’ మూవీ విడుదల కాబోతుంది.
టికెట్స్ ఇలా..
ఈ మూవీ టిక్కెట్ రేట్ల విషయంలో యూనిట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ.175, మల్టీఫ్లెక్స్‌లో రూ.295గా నిర్ణయించారు. ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ.147, మల్టీఫ్లెక్స్‌లో రూ.177 గా నిర్ణయించారు.
కంటెంట్ ఓకే.. లేకపోతే అంతే
కంటెంట్ బాగున్నా టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడం వలన జనాలు థియేటర్స్‌కే రావడం లేదు. ది వారియర్ టికెట్లు ఈ రేంజ్లో ఉంటే సామాన్యలు థియేటర్‌కు రావడం కష్టమే అంటున్నారు నెటిజన్స్. అయితే కంటెంట్ బాగుంటే ఓకేా లేకపోతే థియేటర్స్ ఖాళీగా ఉండాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
థియేట్రికల్ బిజినెస్ ఎంత …
ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే తెలంగాణ : రూ. 11 కోట్లు రాయలసీమ (సీడెడ్) : రూ. 6 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ : రూ. 17 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ :రూ. 2 కోట్లు ఓవర్సీస్ : రూ. 2.10 కోట్లు తమిళ వెర్షన్ : రూ. 5 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా రూ. 43.10 కోట్లు.. తెలుగులో 38.10 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ సినిమా తెలుగులో హిట్ అనిపించుకోవాలంటే రూ. 39 కోట్లు రాబట్టాలి. ఓవరాల్‌గా తమిళంలో కలుపుకుంటే.. రూ. 44 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతోంది. కానీ ఏపీ, తెలంగాణలో రూ. 4 కోట్లకు తగ్గించారు. తమిళ వెర్షన్ రూ. 5 కోట్ల నుంచి రూ. 4 కోట్లకు తగ్గించారు. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లకు తగ్గించారు. ఓవరాల్‌గా రూ. 39 కోట్లు వస్తే ఈ సినిమా బ్రేక్ పూర్తి చేసుకొని హిట్ అనిపించుకుంటోంది. మరోవైపు ఈ చిత్రం హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ కుదిరింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.16 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలకు కలిపి డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రూపేణా.. నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకు రూ.41 కోట్ల లాభం విడుదలకు ముందే వచ్చింది.
ఎవరెవరు ఈ మూవీకి ..
ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. ఈ మూవీ స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమా చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు ఓ వారియర్‌లా పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మూవీ టైంలో రామ్ స్పైనల్ కార్డ్ కి గాయమయ్యింది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే రామ్ మరో సినిమాను మొదలు పెట్టారు.