సెప్టెంబర్ 12.. ఇది ఏపీ రాజకీయాలకు ఒక ముఖ్యమైన రోజు కాబోతుంది. అదే రోజు ఒకే వేదికపైకి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, సోము వీర్రాజు చేరబోతున్నారు. అమరావతి ఉద్యమం మొదలై వెయ్యి రోజులవుతున్న సందర్భంగా ఆ రోజు బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అన్ని పార్టీలవారికి ఆహ్వానాలు పంపారు. అయితే పవన్ కల్యాణ్ ఆ సభకు హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే బిజెపి నేతే సోము వీర్రాజుతో సహా ముఖ్యమైనవారు రాబోతున్నారు. ఇఫ్పటికే బిజెపి అమరావతిలో పాదయాత్ర నిర్వహించింది.ఆ సభ మూడు పార్టీల అలయెన్సుకు దారి వేయబోతున్నదా అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబునాయుడుతో బిజెపి నేతలు చర్చలు జరిపినట్లు టాక్ వినపడుతోంది. మొన్నటివరకు కుదరదంటే కుదరదన్న బిజెపి నేతలు.. మొత్తం మీద పవన్ పట్టుదల వల్లో.. లేక జగన్ వైఖరి వల్లో గాని.. తమ నిర్ణయాన్ని మార్చుకుని టీడీపీతో సఖ్యతగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. వైసీపీ కి అది పెద్ద దెబ్బే కావొచ్చు. లేదా దానినే వైసీపీ తమకు అడ్వాంటేజుగా మార్చుకోవచ్చు.
ఇప్పటివరకు అయితే డైలాగులు పేలాయి గాని.. కలుస్తారో లేదో క్లారిటీ రాలేదు. సెప్టెంబర్ 12న ఆ విషయంపై ఏదో ఒక వివరణ అయితే ఇస్తారని అందరూ ఊహిస్తున్నారు. చంద్రబాబు, పవన్, సోము వీర్రాజు వీరి ప్రసంగాల్లో ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారోనని ఆ మూడు పార్టీల శ్రేణులు ఎదురు చూస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు మాత్రమే బిజెపి చంద్రబాబుతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంది. సోము వీర్రాజు వచ్చాక మాత్రం అసలు కలవనే లేదు. అలాంటిది ఇప్పుడు ట్రెండ్ మార్చబోతున్నారు.ప్రధానమైన డిమాండ్ అమరావతికి అయితే బిజెపి మద్దతు పలుకుతోంది. అలాగే రైల్వేజోన్ కూడా మొత్తానికి ఏర్పాటు చేస్తోంది. ఎటొచ్చీ ప్రత్యేకహోదా మాత్రం అలాగే ఉండిపోయింది. అలాగే పోలవరానికి నిధులు కూడా అలాగే ఆగిపోయాయి. ఈ రెండు సమస్యలు ఎలా పరిష్కరిస్తారో.. జనానికి ఏమని వివరణ ఇచ్చుకుంటారో గాని.. ముగ్గురు కలవడం అయతే ఖాయమే అనిపిస్తోంది.ఇక ఇఫ్పటికే ప్రిపేర్ అయిపోయిన వైసీపీ.. సెప్టెంబర్ 12 తర్వాత ముగ్గురిని కలిపి అటాకింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపితో టీడీపీ, జనసేన కుమ్మక్కయ్యారని.. తాను మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రజల కోసమే కట్టుబడి ఉన్నానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే ఛాన్స్ ఉంది. మరి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే కీలకం.