తెలుగు మూవీస్ లో తెలుగు హీరోయిన్లు కనిపించడం లేదు. స్వాతి, అంజలి లాంటి వాళ్ళు వచ్చినా స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం ఎదగలేకపోయారు. అంజలి కొంచెం బెటర్ అనిపించింది అప్పట్లో. కానీ ఆ స్థాయికి ఎదగలేకపోయింది. తర్వాత ఆనంది, ఈషా రెబ్బా కూడా అచ్చ తెలుగు అమ్మాయిలే. ఇక ఈషా రెబ్బా కూడా అచ్చ తెలుగు అమ్మాయే. ఇక ఇప్పుడు ఒక అచ్చ తెలుగు అందం పాపులర్ అవుతోంది. ఆమె శోభిత ధూళిపాళ. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అమ్మాయి. ఆమె తెలుగు అమ్మాయి అయినా కూడా నటిగా మాత్రం ఆమె కెరీర్ బాలీవుడ్‌తో స్టార్ట్ అయ్యింది. తొలి సినిమా రామన్ రాఘవ్ 2.0తో హీరోయిన్ గా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు మళయాళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో అడవి శేష్ హీరోగా ఆమె చేసిన గూఢచారి సినిమా ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా మంచి ఊపు ఇచ్చింది. ఈ క్రమంలోనే అడవి శేష్ లేటెస్ట్ సినిమా మేజర్‌లో ఆమె నటించింది. శోభితకు మళయాళంలోనూ మంచి క్రేజ్ ఉంది. ఆమె చేసిన కురుప్ సూపర్ హిట్ అయ్యింది. అయితే తెలుగులో టైటిల్ మైనస్ కావడంతో ఇక్కడ ఎవ్వరూ కురుప్‌ను పట్టించుకోలేదు.
దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్ హీరో పక్కన నటించడంతో ఇప్పుడు అక్కడ కూడా ఆమెకు పిచ్చ పాపులారిటీ సంపాదించేసుకుంది. ఇక ఇప్పుడు మణిరత్నం మాగ్నమ్ ఓపస్ ‘పొన్నియన్ సెల్వన్’లో ఓ కీలక పాత్ర పోషించింది. టైటిల్ పాత్రధారి జయం రవి జోడీగా ! ఈ మూవీలో ఆమె కోడంబళూర్ యువరాణి వానతి పాత్రను పోషించింది. ఇటీవల రిలీజైన టీజర్‌లో జయం రవితో పాటు ఓ క్షణం తళుక్కున మెరిసింది శోభిత. రెండు భాగాలుగా తయారవుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం సెప్టెంబర్ 30న రిలీజవుతోంది. తెనాలిలో జన్మించిన శోభిత, విశాఖపట్నంలో పెరిగింది. ముంబై యూనివర్సిటీకి చెందిన H.R. College of Commerce and Economics లో చదువుకున్న ఆమె, ముంబైలోనే కెరీర్‌ను వెతుక్కుంది. అలా అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన ‘రమన్ రాఘవ్ 2.0’ మూవీలో అమాంతం పెంచేసింది. త్వరలో ఆమె హాలీవుడ్ మూవీలో కనిపించి సందడి చేయనుంది. దేవ్ పటేల్ లీడ్ రోల్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్న ‘మంకీ మ్యాన్’ అనే మూవీలో ఫిమేల్ లీడ్ రోల్‌ను పోషిస్తోంది శోభిత.