టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు ఏడాది పాటు ఆయన ప్రజల్లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల మూడో వారం నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయాన్ని టీ-డీపీ అధినేత తీసుకున్నారు. పర్యటనల్లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రధానంగా ప్రస్తావించి ఎండగట్టానున్నారు. అలాగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా ప్రతి జిల్లాలో జిల్లా మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 15 నుంచి చంద్రబాబు మలివిడత జిల్లా పర్యటన చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా ప్రతి జిల్లాలో మినీ మహానాడు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. జిల్లా పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృత పర్యటనలకు నిర్ణయించారు. ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లా టూర్లు చేపట్టాలని నిర్దేశించారు. ఈ నెల మూడో వారం నుంచే చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది.
15న చోడవరంలో జిల్లా మహానాడులో పాల్గొననున్నారు. అందులో భాగంగా.. బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ నెల 16న అనకాపల్లిలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. ఈనెల 17న చీపురుపల్లిలో ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఏడాదిలో 80కి పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా అధినేత పర్యటన సాగనుంది. అటు జిల్లాల పర్యటనలు, ఇటు కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా సాగేలా షెడ్యూల్ రూపొందించారు.
ఈ నెల 15వ తేదీ నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు మలివిడత జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. 15, 16, 17తేదీల్లో అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 15న చోడవరంలో జిల్లా మహానాడు కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 16న అనకాపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. 17న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమానికి హాజరుకానున్నారు.