శ్రీరాముడు జన్మించిన నేలను మొదలుకొని ఆయన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ “శ్రీ రామాయణ యాత్ర” పేరిట భారత్ గౌరవ్ పర్యాటక రైలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కిషన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన సాయంత్రం 5:30 గంలకు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ లో ప్రారంభించనున్నారు.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి “శ్రీ రామాయణ యాత్ర” భారత్ గౌరవ్ పర్యాటక రైలును ప్రారంభించనున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్-నేపాల్ మధ్య నడిచే మొట్టమొదటి పర్యాటక రైలు ఇదే. 3వేల 500 కోచ్ లతో భారత్ గౌరవ్ పేరిట ప్రైవేట్ పర్యాటక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది భారత ప్రభుత్వం. ఈ నెల 14న “షిర్డీ యాత్ర” పేరిట మొట్టమొదటి భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభమైంది.
నేడు శ్రీరాముడు జన్మించిన నేలను మొదలుకొని ఆయన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ “శ్రీ రామాయణ యాత్ర” పేరిట భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభం కానుంది. 18 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. అయోధ్య, బక్సర్, సీతామర్హి, జనక్ పూర్, వారణాసి, ప్రయాగ్ రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం, కాంచీపురం, భద్రాచలం వంటి వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి ఢిల్లీతో ముగుస్తుంది. యాత్ర పొడవునా యాత్రికులకు భోజన, వసతి సదుపాయాలు, ప్రయాణ ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, గైడ్స్ వంటి సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది.
దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని సంకల్పించిన ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా భారతీయ రైల్వే, ఐఆర్ సిటీసీతో కలిసి వివిధ ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక, ఆధ్యాత్మిక నేపథ్యాలను ఎంచుకొని కొన్ని ప్రత్యేక రైళ్లను పర్యాటకులు/యాత్రికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా దేశంలోని అనేక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించింది. 3వేల 500 కోచ్ లతో భారత్ గౌరవ్ పేరిట దేశంలోని వివిధ మార్గాల్లో కొన్ని ప్రత్యేక ప్రైవేట్ పర్యాటక రైళ్లను భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగానే ఈ నెల 14న “షిర్డీ యాత్ర” పేరిట మొట్టమొదటి భారత్ గౌరవ్ పర్యాటక రైలును ప్రారంభించడం జరిగింది.
తొలి ప్రైవేటు రైలు ప్రారంభం
ఈ రైలులో మొత్తం 14 కోచ్ లు ఉంటాయి. 600 మంది సామర్థ్యం ఉన్న ఈ రైలు మొదటి ప్రయాణంలో 500 మంది యాత్రికులు ప్రయాణం చేయనున్నారు. కోచ్ లన్నీ కూడా 3 టైర్ ఏసీ సౌకర్యంతో యాత్రకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక మార్పులు చేయబడి ఉంటాయి. అవసరమైన చోట సమీప హోటళ్లలోని ఏసీ రూముల్లో బస ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రయాణం చేయాలంటే ఒక్కో ప్యాసింజర్ రూ.62వేల 370 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలు బయటి వైపున సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా వివిధ చిత్రాలను, పురాతన కట్టడాలను, ఆలయాలను, నృత్య రూపాలు, వంటకాలు, వస్త్రధారణ, యుద్ధ కళలు, జానపద కళలు వంటి వాటిని ప్రదర్శించడం జరిగింది. రైలు కోచ్ లపై కొన్ని శతాబ్దాల కాలం కిందట సారనాథ్ లో నిర్మించిన ధమేక్ స్తూపం మొదలుకొని ఇటీవలే న్యూఢిల్లీలో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ వరకు ఉన్న వివిధ కట్టడాలను ప్రదర్శించడం జరిగింది.. వీటితో పాటుగా ఈశాన్య రాష్ట్రాలు, కేరళకు సంబంధించిన యుద్ధ విద్యలను ప్రదర్శించారు. అంతేకాకుండా, వైవిధ్యమైన గొప్ప నిర్మాణాలను తెలియజేసే త్రిపురలోని నీర్ మహల్, ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి ఆలయంలో ఉన్న నంది విగ్రహం, న్యూఢిల్లీలోని ఆధునిక లోటస్ టెంపుల్ వంటి స్మారక కట్టడాలను కూడా ప్రదర్శించడం జరిగింది.
వారణాసి నుంచి చెన్నైకి రేపు ప్రత్యేక రైలు – ఒక్కరోజు మాత్రమే
ఐఆర్ సిటీసీ ఆధ్వర్యంలో వివిధ నేపథ్యాలతో దేశం నలుమూలలా నడిచే భారత్ గౌరవ్ పర్యాటక రైళ్లను ఉపయోగించుకుని పెద్ద ఎత్తున పర్యాటక ప్రదేశాల్లో పర్యటించాలని, ప్రతి ఒక్కరూ కొన్ని మధుర స్మృతులను తమ తమ జీవితాలకు జోడించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరడం జరిగింది.
ప్రత్యేకతలు
శ్రీరాముడు జన్మించిన నేలను మొదలుకొని ఆయన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ “శ్రీ రామాయణ యాత్ర” పేరిట భారత్ గౌరవ్ పర్యాటక రైలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కిషన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన సాయంత్రం 5:30 గంలకు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ లో ప్రారంభించనున్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి “శ్రీ రామాయణ యాత్ర” భారత్ గౌరవ్ పర్యాటక రైలును ప్రారంభించనున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్-నేపాల్ మధ్య నడిచే మొట్టమొదటి పర్యాటక రైలు ఇదే. 3వేల 500 కోచ్ లతో భారత్ గౌరవ్ పేరిట ప్రైవేట్ పర్యాటక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది భారత ప్రభుత్వం. ఈ నెల 14న “షిర్డీ యాత్ర” పేరిట మొట్టమొదటి భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభమైంది.
నేడు శ్రీరాముడు జన్మించిన నేలను మొదలుకొని ఆయన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ “శ్రీ రామాయణ యాత్ర” పేరిట భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభం కానుంది. 18 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. అయోధ్య, బక్సర్, సీతామర్హి, జనక్ పూర్, వారణాసి, ప్రయాగ్ రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం, కాంచీపురం, భద్రాచలం వంటి వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి ఢిల్లీతో ముగుస్తుంది. యాత్ర పొడవునా యాత్రికులకు భోజన, వసతి సదుపాయాలు, ప్రయాణ ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, గైడ్స్ వంటి సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది.
దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని సంకల్పించిన ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా భారతీయ రైల్వే, ఐఆర్ సిటీసీతో కలిసి వివిధ ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక, ఆధ్యాత్మిక నేపథ్యాలను ఎంచుకొని కొన్ని ప్రత్యేక రైళ్లను పర్యాటకులు/యాత్రికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా దేశంలోని అనేక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించింది. 3వేల 500 కోచ్ లతో భారత్ గౌరవ్ పేరిట దేశంలోని వివిధ మార్గాల్లో కొన్ని ప్రత్యేక ప్రైవేట్ పర్యాటక రైళ్లను భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగానే ఈ నెల 14న “షిర్డీ యాత్ర” పేరిట మొట్టమొదటి భారత్ గౌరవ్ పర్యాటక రైలును ప్రారంభించారు.
తొలి ప్రైవేటు రైలు ప్రారంభం
ఈ రైలులో మొత్తం 14 కోచ్ లు ఉంటాయి. 600 మంది సామర్థ్యం ఉన్న ఈ రైలు మొదటి ప్రయాణంలో 500 మంది యాత్రికులు ప్రయాణం చేయనున్నారు. కోచ్ లన్నీ కూడా 3 టైర్ ఏసీ సౌకర్యంతో యాత్రకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక మార్పులు చేయబడి ఉంటాయి. అవసరమైన చోట సమీప హోటళ్లలోని ఏసీ రూముల్లో బస ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రయాణం చేయాలంటే ఒక్కో ప్యాసింజర్ రూ.62వేల 370 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలు బయటి వైపున సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా వివిధ చిత్రాలను, పురాతన కట్టడాలను, ఆలయాలను, నృత్య రూపాలు, వంటకాలు, వస్త్రధారణ, యుద్ధ కళలు, జానపద కళలు వంటి వాటిని ప్రదర్శించడం జరిగింది. రైలు కోచ్ లపై కొన్ని శతాబ్దాల కాలం కిందట సారనాథ్ లో నిర్మించిన ధమేక్ స్తూపం మొదలుకొని ఇటీవలే న్యూఢిల్లీలో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ వరకు ఉన్న వివిధ కట్టడాలను ప్రదర్శించడం జరిగింది. వీటితో పాటుగా ఈశాన్య రాష్ట్రాలు, కేరళకు సంబంధించిన యుద్ధ విద్యలను ప్రదర్శించారు. అంతేకాకుండా, వైవిధ్యమైన గొప్ప నిర్మాణాలను తెలియజేసే త్రిపురలోని నీర్ మహల్, ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి ఆలయంలో ఉన్న నంది విగ్రహం, న్యూఢిల్లీలోని ఆధునిక లోటస్ టెంపుల్ వంటి స్మారక కట్టడాలను కూడా ప్రదర్శించడం జరిగింది.
వారణాసి నుంచి చెన్నైకి రేపు ప్రత్యేక రైలు – ఒక్కరోజు మాత్రమే
ఐఆర్ సిటీసీ ఆధ్వర్యంలో వివిధ నేపథ్యాలతో దేశం నలుమూలలా నడిచే భారత్ గౌరవ్ పర్యాటక రైళ్లను ఉపయోగించుకుని పెద్ద ఎత్తున పర్యాటక ప్రదేశాల్లో పర్యటించాలని, ప్రతి ఒక్కరూ కొన్ని మధుర స్మృతులను తమ తమ జీవితాలకు జోడించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరడం జరిగింది.