Connect with us

Hi, what are you looking for?

Andhra News

ఎస్సీ హాస్టళ్లలో ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు : మంత్రి మేరుగు నాగార్జున

ఎస్సీ హాస్టళ్లలో చదివే 9వ తరగతి విద్యార్థులకు రెండు నెలల ముందు నుంచే 10వ తరగతి కి సంబంధించిన పాఠ్యాంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు..

Share

ఎస్సీ హాస్టళ్లలో చదివే 9వ తరగతి విద్యార్థులకు రెండు నెలల ముందు నుంచే 10వ తరగతి కి సంబంధించిన పాఠ్యాంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షలలో అతి తక్కువ శాతం ఫలితాలు వచ్చిన చోట ప్రిన్సిపాల్స్ పై చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు..ఎస్సీ హాస్టళ్లలో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలలో 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులైన నేపథ్యంలో సాంఘిక సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం తన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, ఎస్సీ హాస్టళ్లలో వచ్చిన పదవ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఎస్సీ హాస్టళ్లలో రాష్ట్రస్థాయిలో 49 శాతం ఫలితాలు వచ్చినా కొన్ని జిల్లాల్లో ఫలితాల శాతం మరీ తక్కువగా ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేసారు. అతి తక్కువ ఫలితాలు వచ్చిన చోట ప్రిన్సిపాల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు అందర్నీ మళ్లీ హాస్టళ్లకు పిలిచి వారిని అక్కడే పెట్టుకొని, సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణులు కావడానికి అవసరమైన స్పెషల్ ట్యూషన్లు పెట్టించాలని, ప్రతి విద్యార్థి కూడా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా చూసుకోవాలని కోరారు. అలాగే 9 తరగతికి చెందిన విద్యార్థులు పదవ తరగతికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా రెండు నెలల ముందుగానే వారికి పదో తరగతికి చెందిన పాఠ్యాంశాలపై అవగాహన కల్గించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. అయితే ఫలితాలు మెరుగుపడకపోతే మాత్రం తాను సహించేది లేదని నాగార్జున హెచ్చరించారు. ఎస్సీ హాస్టళ్లలో ఫలితాలను మెరుగుపర్చడానికి తీసుకోనున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో కలిసి ఎస్సీ విద్యార్థులకు ఉపాధి కల్పించే కోర్సులను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని నాగార్జున అధికారులను ఆదేశించారు. నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, హెవీ డ్రైవర్ లాంటి కోర్సులతో పాటుగా కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

డీలర్ పై చట్టపరమైన చర్యలు 

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇ- ఆటోలను కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బును చెల్లించినా ఇప్పటి వరకూ వాహనాలను సరఫరా చేయకుండా, కార్పొరేషన్ చెల్లించిన డబ్బును కూడా వెనక్కి చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న కెనటిక్ గ్రీన్ పవర్ కంపెనీ, ఆ కంపెనీ డీలర్ తాడేపల్లికి చెందిన వెంకటేశ్వరా ట్రేడర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగార్జున ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆ డీలర్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ కు రావాల్సిన పొమ్మును రాబట్టాలని ఆదేశించారు. వెంకటేశ్వరా ట్రేడర్స్ కు ఎస్సీ కార్పోరేషన్ 7500 ఇ- ఆటోల కోసం రూ.33.11 కోట్లను చెల్లించగా వాటిలో రూ.13 కోట్ల విలువైన 2550 వాహనాలను మాత్రమే డీలర్ సరఫరా చేసారు. మిగిలిన రూ.20.17 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ కు బకాయిపడ్డారు. ఈ మొత్తం వసూలుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నాగార్జున ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, డైరెక్టర్ కే.హర్షవర్ధన్, హాస్టల్స్ డీడీ లక్ష్మీసుధ, ఎస్సీ కార్పొరేషన్ జీఎం కరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Beşiktaş su kaçak tespiti Beşiktaş’ta Su Kaçağı Tespiti ve Onarımı Kameralı Su Kaçağı Tespiti ve Onarımı Beşiktaş’ta su kaçağı tespiti ve onarımı firmamız tarafından...

Lingual Support by India Fascinates