భారత రాజకీయాల్లో నేషనల్ కాంగ్రెస్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు చరిత్ర నిండా జాతీయోద్యమ స్ఫూర్తిని నింపుకొని స్వాతంత్రం కోసం పోరాడిన ధీరుల కథలలో చాల వరకు నేషనల్ కాంగ్రెస్ నుండే ఉంటాయి.. స్వాతంత్య్రానంతరం కూడా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ కాలం ఈ దేశాన్ని పరిపాలించింది అటువంటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి నేడు గ్రహణం పట్టింది అనాలోచిత నిర్ణయాలు తప్పుడు రాజకీయ ఎత్తుగడలతో తన రాజకీయ ప్రాభవాన్ని తానే సమాధి చేసుకుంది ఒక్కోరాష్ట్రం లో అధికారాన్ని కోల్పోతూ తన స్వయంకృతాపరాదం వల్ల బీజేపీ ని మోడీ ని గద్దెనెక్కిస్తూ తన భవిష్యత్ మాత్రం అంధకారంలోకి నెట్టేసుకుంది
కాంగ్రెస్ చరిత్ర – నేషనల్ హెరాల్డ్ కేసు
1885 లో ఏ ఓ హుమ్ చే స్థాపింపబడిన కాంగ్రెస్ పార్టీ లో గాంధీ అంబెడ్కర్ లాంటి మహానుభావులు సభ్యులుగా ఉండేవారు అంతటి చారిత్రక వైభవం ఉన్న పార్టీ నేడు నాయకుల లేమితో అధికారం లోకి వచ్చే జాడలు కనుచూపుమేరలో కనపడకపోవడం తో పార్టీలో తీవ్ర స్తబ్దత నెలకొని ఉంది. తాజాగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని సుమారు 2000 వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను కూడబెట్టారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శాఖ నోటీసు లిచ్చి విచారణకు పిలిపించి ఇంట్రాగేట్ చేయడం తో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోనళనకు పిలుపునిచ్చాయి.నేషనల్ హెరాల్డ్ పత్రిక ( ఏ జే ల్) కు సంబంధించి మెజారిటీ షేర్లును సోనియా గాంధీ రాహుల్ గాంధీ డైరెక్టర్స్ గా ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి తరలించారని సుమారు 2000 కోట్ల రుపాయల మనీ లాండరింగ్ కి సోనియా రాహుల్ ప్రయతించారని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి గతం లో ఢిల్లీ లో ప్రైవేట్ కేసు దాఖలు చేసారు దాన్ని ఆధారంగా తీసుకొని నేడు ఈ డి విచారణ చేపట్టింది.క్లిష్టమైన కంపెనీ చట్టాలకు సంబందించిన కేస్ కావటం తో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
షేర్లు బదలాయింపు – హెరాల్డ్ పత్రిక మూసివేత
ఏ జే ల్ నష్టాల్లో ఉందంటూ 2008 లో ఆ పత్రికను మూసివేశారు తర్వాత ఆ సంస్థ ఆస్తులను అద్దెకు ఇచ్చేందుకు ప్రయతించారు ఏ జే ల్ కార్యాలయాన్ని ఢిల్లీ లోనికి తరలించారు ఈ నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటి ఏ జే ల్ కు గతం నుండి రుణాలు ఇస్తూ ఉంది అది సుమారు 90 కోట్లకు చేరింది దీంతో కాంగ్రెస్ అత్యున్నత కమిటీ ఏ జే ల్ మెజారిటీ షేర్స్ ను సోనియా రాహుల్ డైరెక్టర్స్ గా ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీ కి బదలాయించింది అంతకు ముందే రాహుల్ గాంధీ ని యంగ్ ఇండియన్ కంపెనీ కి డైరెక్టర్ గా నియమించటం జరిగింది.అంటే ఏ జే ల్ షేర్లు బదలాయించే మూడు రోజుల ముందు రాహుల్ గాంధీ ని యంగ్ ఇండియన్ కంపెనీ కి డైరెక్టర్ గా ఉంచటం జరిగింది.ఇది కేవలం సంస్థ ఆస్తులు కేట్టేయటానికి కాంగ్రెస్ చేసిన నాటకం అని బీజేపీ వాదిస్తోంది.
యంగ్ ఇండియా కంపెనీ – సోనియా రాహుల్ కు సంబంధాలు
యంగ్ ఇండియా అనేది ఒక ప్రైవేట్ కంపెనీ దీని 2010 లో స్థాపించారు ఇందులో సోనియా రాహుల్ కు 76 % మెజారిటీ షేర్స్ ఉన్నాయి మిగిలిన 24 % షేర్స్ కాంగ్రెస్ నేతలైన మోతిలాల్ ఒరా ఆస్కార్ ఫెర్నాండేజ్ కు చెరి సమంగా ఉన్నాయి 2011 లో ఏ జే ల్ షేర్స్ కేటాయింపు జరిగింది ఐతే ఈ ఏ జే ల్ షేర్స్ ను కొంత రతన్ దీప్ ట్రస్ట్ జనహిత నిది ట్రస్ట్ ల ద్వారా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కొనుగోలు చేసారని ఇందులో కంపెనీ చట్టాలు వీరు అతిక్రమించారని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఆరోపించారు.కాంగ్రెస్ అత్యున్నత కమిటీ నుండి ఏ జే ల్ తీసుకున్న 90 కోట్ల రుణాలను కూడా యంగ్ ఇండియన్ కు బదిలీ చేయటం ద్వారా ఏ జే ల్ లోని 9 కోట్ల షేర్ ను యంగ్ ఇండియన్ కంపెనీ పొందింది ఇలా అనేక రూపాలలో వివిధ మార్గాల ద్వారా ఏ జే ల్ షేర్స్ ను యంగ్ ఇండియన్ కంపెనీ హస్తగతం చేసుకుంది.
సుబ్రమణ్య స్వామి ఆరోపణలు – నిజాలు
బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ప్రధాన వాదన ఏమంటే వాణిజ్య అవసరాల కోసం రాజకీయ పార్టీ డబ్బును అప్పుగా ఇవ్వటం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని 29 ఏ బి సి సెక్షన్స్ ఆదాయపు పన్నుల చట్టం 1961 లో సెక్షన్ 13 ఏ ప్రకారం అక్రమమని స్వామి వాదన
1 ఏ జే ల్ అనేది 5000 వేల మంది షేర్స్ తో స్థాపించబడిన పబ్లిక్ సంస్థ
దీనిద్వారా నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక నడిపి ప్రజల్లో చైతన్యం తేవాలనేది నెహ్రూ భావన
2 నష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అత్యున్నత కమిటీ తనకు ప్రజల నుండి వచ్చిన విరాళాలను ఏ జే ల్ సంస్థకు సుమారు 90 కోట్లు అప్పుగా ఇచ్చింది.ఇదే ఇప్పుడు సుబ్రమణ్య స్వామి వాదన ఎందుకు ప్రజల విరాళాలను కాంగ్రెస్ అత్యున్నత కమిటీ వాణిజ్య సంస్థ ఐన ఏ జే ల్ కు అప్పుగా ఇచ్చింది ఇది చట్ట ప్రకారం తప్పు అని కోర్ట్ లో స్వామి దావా వేయటం జరిగింది
౩ మరో వాదన అప్పుగా ఇచ్చిన 90 కోట్ల రుణాలను మెజారిటీ షేర్స్ ను కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ ఎందుకు ఏ జే ల్ కు బదలాయించింది
4 రతన్ దీప్ ట్రస్ట్ ద్వారా జనహిత ట్రస్ట్ ద్వారా ఏ జే ల్ పూర్తీ షేర్స్ ను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎందుకు తమ కంపెనీ లోకి తెచ్చుకున్నారు
5 ఇదంతా పథకం ప్రకారం జరిగిందని స్వామి ఆరోపణ ఏది ఏమైనా ఇలాంటి ఆరోపణల్లో కాంగ్రెస్ బాస్ లు చిక్కుకోవటం కాంగ్రెస్ కు చావుదెబ్బనే చెప్పక తప్పదు.
తిప్పికొట్టిన కాంగ్రెస్
బీజేపీ ఆరోపణలో వాస్తవం లేదని అదంతా చట్ట వ్యతిరేకమైన పనులకు రావని అంతా లెక్కల ప్రకారమే జరిగాయని కాంగ్రెస్ వాదిస్తోంది సత్యగ్రహ ర్యాలీలు కూడా చేస్తుంది ఏది ఏమైనప్పటికి ఇటువంటి అక్రమ అవినీతి ఆరోపణలు రావటం చాల బాధాకరం ఇది కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర ప్రభావం చూపుతోందంది రాజకీయ వేత్తలు లెక్కలు వేస్తున్నారు