కాజల్ మళ్ళీ బిగ్ స్క్రీన్ పై మెరవడానికి రెడీ ఐపోయింది. హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని ఒక బిడ్డకు తల్లైన కాజల్ కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు భారతీయుడు – 2 లో మెరవబోతోంది. ఈ గుడ్ న్యూస్ ని తన ఫాన్స్ ఇన్స్టా పేజీ ద్వారా చెప్పింది. శంకర్ డైరెక్షన్ లో 1996లో వచ్చిన భారతీయుడు మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 26 ఏళ్ల తరువాత ఆ మూవీ సీక్వెల్ ‘భారతీయుడు 2’ గా మనముందుకు రాబోతోంది. 2020లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. అనుకోకుండా షూటింగ్ సెట్స్‌లో ప్రమాదం జరగడం, తర్వాత కోవిడ్ , దర్శక నిర్మాతల మధ్య మనస్పర్ధల కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. కమల్ కూడా విక్రమ్ సినిమాతో ఫుల్ బిజీ ఐపోయాడు. ఇక ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా భారతీయుడు 2 షూటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఈ వ్యవహారమంతా కోర్ట్ లో ఉండేసరికి కాజల్ కూడా ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఐతే ఇప్పుడు ఈ ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్ లో క్లారిటీ ఇచ్చారు. అలాగే బాలీవుడ్ యాక్టర్ నేహా ధూపియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 13 – ఇండియన్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందని కాజల్ తెలిపారు. ఇక ఇన్నాళ్ళు ఇండియన్ 2 నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకుందని వస్తున్నవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఇక ఈ చిత్రంలో సుకన్య, సిద్ధార్ధ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ ప్రసాద్, బాబీ సింహ, సముద్రఖని, ఢిల్లీ గణేశ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఇక కాజల్ ఫైనల్ గా ‘హే సినామిక’ మూవీలో నటించింది. ఈ ఇయర్ ఏప్రిల్ లో ఆమె ఓ బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాబట్టే నాగార్జునతో కలిసి నటించాల్సిన “ది ఘోస్ట్” మూవీ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఇండియన్ 2 లాంటి భారీ పాన్ ఇండియా మూవీ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక ఈ విషయం తెలిసి కాజల్ అభిమానులు ఫుల్ చిల్ అవుతున్నారు .