ఏపీ సీఎం జగన్ పాలనలో అడవులు, కొండలు కరిగించేసి సొమ్ము చేసుకున్న సర్కార్ ఇప్పుడు దేవుడి సొమ్ముపై కన్నేసింది. దేవాలయాల డిపాజిట్లను రద్దు చేయాలని ఎండోమెంట్ కమిషనర్ ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దేవాలయాల బ్యాంకు ఖాతాలు వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ఈ నెల 1 వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి 45 కోట్ల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్లను ఈవోలు క్యాన్సిల్ చేశారు. మొత్తంగా దేవాలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడం ద్వారా 500 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ టార్గెట్ గా చెబుతున్నారు. ఆయా దేవాలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడం ద్వారా వచ్చిన నగదును ఆలయ అధికారులు కామన్ గుడ్ ఫండ్ (సీజెఎఫ్)కు జమ చేస్తున్నారు. సీజేఎఫ్ నిధులను ఆలయాల జీర్ణోద్ధరణకే ఉపయోగించాల్సి ఉండగా దేవాదాయ శాఖ మాజీ మంత్రి వాటిని ఇష్టానుసారం బదలాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు కూడా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అభ్యంతరాలూ, ఆందోళనలను పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల దేవాలయాలలో ఎఫ్ డీలను రద్దు చేయడానికి జగన్ సర్కార్ సిద్ధమైపోయింది. ఇలా ఎఫ్ డీల రద్దు ద్వారా 500 కోట్ల రూపాయలు సమీకరించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రోజువారిగా ఆలయాల డిపాజిట్ల రద్దుపై దృష్టి సారించారు దేవాదాయ శాఖ అధికారులు. గతంలో అవినీతి కేసులో ఏసీబీకి చిక్కిన ఒక దేవాదాయ శాఖ ఉన్నతాధికారి సూచన మేరకు జగన్ సర్కార్ ఈ డిపాజిట్ల రద్దుకు తెరతీసిందని చెబుతున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లా అయినివిల్లిలంక వినాయక టెంపుల్, నెల్లూరు జిల్లా మూలస్థానేశ్వరస్వామి దేవాలయం, విజయవాడ యనమలకుదురు శివాలయం 30లక్షల రూపాయల చొప్పున ఎఫ్ డీలను రద్దు చేయగా, సింగరాయపాలెం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి 20 లక్షల రూపాయల డిపాజిట్లు క్యాన్సిల్ అయ్యాయి.
హిందూ దేవాలయాల నిధుల మళ్ళింపు వాస్తవం కాదు – మంత్రి కొట్టు సత్యనారాయణ
రాష్ట్రంలో హిందూ దేవాలయాల నిధుల మళ్ళింపు జరిగినట్టు గత రెండు రోజులుగా ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న ఆరోపణలు సత్య దూరమన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. రాష్ట్రంలో 5 లక్షల ఆదాయం, పైబడి ఉన్న ప్రతి దేవాలయం తమ ఆదాయం నుండీ కామన్ గుడ్ ఫండ్ కింద 9 శాతం మేర నిధులను దేవాదాయ శాఖకు జమచేసే విధంగా చట్ట నిబంధనలు ఉన్నాయని, కాగా తమ ప్రభుత్వ హయాంలో 20 లక్షల మేర ఆదాయం ఉన్న దేవాలయాల నుండీ మాత్రమే నిర్దేశిత మొత్తం CGF కింద దేవాదాయ శాఖకు చెల్లించే ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ వాస్తవం తెలుసుకోకుండా సదరు రాష్ట్ర నాయకుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం దురదృష్టకర మన్నారు. రాష్ట్రంలో ఉన్న 8 ప్రధాన దేవాలయాలకు అదనంగా వాటి తరువాత స్థానంలో ఉన్న మరో 32 దేవాలయాల పూర్తి స్థాయి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తున్నట్టు ఆయన తెలిపారు.
హిందూ దేవాలయాలు, భగవంతుని పట్ల తనకు, ముఖ్యమంత్రికి అపారమైన భక్తి, విశ్వాసాలు ఉన్నాయని, రాష్ట్రంలో ఉన్న వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం తమ శాఖ అధికారులతో ప్రతివారం క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆదాయం అధికంగా ఉన్న దేవాలయాల రాబడి నుండి చట్టంలో నిర్దేశించబడిన విధంగా 8 శాతం మొత్తం ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ గా, 1.5 శాతం మేర ఆడిట్ ఫండ్ గా,9శాతం మేర కామన్ గుడ్ ఫండ్ గా, మరో 3 శాతం మేర అర్చక సంక్షేమ నిధి గానూ డిపాజిట్ చేయిస్తున్నామని, ఈ మొత్తాల నుండి మాత్రమే తగిన ఆదాయం లేని దేవాలయాల నిర్వహణ, నిత్య ధూప, దీప నైవేద్యాల కోసం వచ్చే దరఖాస్తులకు అవసరం మేరకు చెల్లింపులు చేస్తున్నామని, తమ వద్ద నేటికి ఇంకా 3365 ఇలాంటి అభ్యర్థనలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు, షెడ్యూల్డ్ నియోజకవర్గాలలో ఉన్న దేవాలయాలకు ఆర్థిక సాయం కోసం వచ్చే దరఖాస్తుల విషయంలో మరికొంత వెసులుబాటు ఇచ్చి అధిక మొత్తం కేటాయిస్తున్నామన్నారు.
అన్ని దేవాలయాల రాబడి, ఖర్చులపై మార్చి, 2022 చివరికల్లా ఖచ్చితంగా పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించేందుకు నిర్ణయించామని, కాగా సెప్టెంబర్ 2022 చివరికి ఆడిట్ పూర్తి కోసం అధికారులు గడువు కోరారన్నారు. ప్రతి దేవాలయం లోనూ భక్తుల కోరిక మేరకు అన్ని పూజలు, కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం, వారికి అవసరం అయిన మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వంలో వారి పార్టీ సభ్యుడే కొన్నాళ్ళు దేవాదాయ మంత్రిగా పనిచేసి ఉన్నారని, ఆయన హయాంలో, వివిధ కారణాలతో రాష్ట్రంలో 44 దేవాలయాలను కూలగొట్టించారని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న నాయకుడు సదరు విషయం పై కనీసం విచారం కూడా వ్యక్తంచేయక పోవడం శోచనీయం అన్నారు. తమ శాఖలో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేదని, తమ శాఖ అధికారులపై అవినీతి ఆరోపణలను తీవ్రంగా పరిగణించి రుజువైన పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే తమ శాఖ నిధుల నుండి అన్య మతాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామని ఆరోపించడం అవాస్తవం, అసాధ్యం అన్నారు. దేవాలయాల ఆదాయాన్ని ఖర్చు చేసే విషయంలో సంబంధిత దేవాలయ కార్యనిర్వహణాధికారి స్థాయి నుండి శాఖ కమిషనర్ వరకూ అందరూ జవాబుదారులేనన్నారు. రాష్ట్రంలో వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం అందే ప్రతిపాదనలపై ప్రభుత్వం అందించే నిధులకు మాచింగ్ ఫండ్ మొత్తాలు CGF నిధుల నుండీ సమకూర్చాల్సి ఉండగా వివిధ దేవాలయాల నుండీ ఈ పద్దుకు జమ కావాల్సిన మొత్తాలు సుమారు 160 కోట్ల రూపాయలు బకాయిల రూపంలో ఉన్నాయన్నారు. అయితే అలా జమ కావాల్సిన మొత్తాలు కూడా ఆయా దేవాలయాల కమిటీలు మిగులు నిధులుగా పరిగణించి ఫిక్స్డ్ డిపాజిట్లు రూపంలో బ్యాంకులలోనే ఉంచారని, వాటి విషయంలోఎక్కడా అవినీతి జరగలేదని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని, వెంటనే వారు చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని ఇకపై వాస్తవాలు తెలుసుకుని మాత్రమే మాట్లాడాలని సలహా ఇచ్చారు.
వివిధ దేవాలయాల పాలక మండళ్ళు వాటి కాల పరిమితి తీరే వరకూ అధికారంలో ఉంటాయని, కాల పరిమితి తీరకుండా వేటినీ రద్దు చేసే సమస్య లేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే, దుర్గ గుడి ఘాట్ రోడ్డుపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణ కోసం ప్రత్యామ్నాయ పద్ధతులను ఆలోచన చేస్తున్నామని, ఆ ఆలోచన అమలు చేసే సమయంలో ఘాట్ రోడ్డు మూసివేసి ప్రతి ఒక్కరికీ రాజ గోపురం మార్గం ద్వారానే ఆలయ ప్రవేశం కల్పించే ఆలోచన కూడా ఉందన్నారు. అలాగే, ఉత్సవాల సమయాల్లో ఓకే సమయంలో కనీసం 30, 40 వేల మంది భక్తులు కొండపై ఉండి వీక్షించే వీలు కల్పించే విధంగా, ఇప్పుడున్న క్యూ కాంప్లెక్స్ కి అదనంగా ఇంకో క్యూ కాంప్లెక్స్ కట్టే ఆలోచన ఉందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే శ్రీశైలం దేవస్థానం లో తూర్పు ద్వార ప్రవేశం కల్పన, అక్కడ అధికంగా వసూలు చేస్తున్న అభిషేకం రుసుముల విషయం తమ దృష్టికి తీసుకుని వచిందన్నారు.
దేవాలయాల జోలికొస్తే ఖబడ్దార్. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఐదు లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలి. అలా చేయకుండా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిటట్లాడుతున్న చిన్నచిన్న దేవాలయాల నిధులు కూడా మింగేయాలి అనుకోవడం పరమ ధర్మార్గం.(1/3)@blsanthosh pic.twitter.com/uNWMOKESVh
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 16, 2022
భక్తుల కానుకలపై క్లారిటీ ఇవ్వండి.. జగన్‌కు బీజేపీ బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలకు భక్తులు ఇచ్చిన కానుకలపై పూర్తి క్లారిటీ ఇవ్వాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఆలయాలకు అన్ని ఖర్చులన్నీ పోను మిగతా సొమ్మంతా సర్వశ్రేయోనిధికి జమ చేయాలని అధికారులను ఆదేశించారో లేదో అనే విషయాన్ని హిందూ సమాజానికి వెల్లడించాలని వీర్రాజు డిమాండ్ చేశారు. భక్తుల సొమ్మును ప్రభుత్వం దోచుకోవడానికి పూనుకోవడం దారుణమని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని.. హిందూ ధర్మ ఆచార వ్యవహారాలు ప్రభుత్వం విస్మరిస్తోందంటూ సోము వీర్రాజు విమర్శించారు. దేవాలయాలు, సందర్శనీయ క్షేత్రాల విషయంలో ప్రభుత్వం పొరపడితే నిర్ణయాలు మార్చుకోవాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి వచ్చిన ఆదాయ పొదుపు మొత్తాన్ని చిన్న చిన్న ఆలయాలు ఎఫ్‌డీల రూపంలో భద్రపరుచుకుంటే ఆ మొత్తాలను ప్రభుత్వం దోచుకోవడానికి పూనుకోవడం దారుణమని సోము వీర్రాజు ఆరోపించారు. ముల్లాలకు, పాస్టర్లకు గౌరవ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లిస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఔరంగజేబు, నైజాం నవాబు సైతం చేయని విధంగా ఆలయాల సొమ్మును దోచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడు మాన్యాలను కూడా ఇప్పటికే రకరకాల పథకాల పేరట కబ్జా చేశారని పేర్కొన్నారు. కామన్ గుడ్ ఫండ్ అనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారానికి లోబడి ఉంటుందని.. కానీ ఇందులో జమ అయిన దేవాలయాల నిధులను అన్యమతస్థులకు పంచి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం తగదంటూ సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఐదు లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకుండా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిటట్లాడుతున్న చిన్నచిన్న దేవాలయాల నిధులు కూడా మింగేయాలి అనుకోవడం పరమ దుర్మార్గమన్నారు. హిందూ దేవాలయాలు శక్తి కేంద్రాలు, భక్తి కేంద్రాలు, ముక్తి కేంద్రాలు వాటిని మూసివేయడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటే ఆ ప్రక్రియలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావడం.. దేవదాయ శాఖ భూములు, నిధులను కాజేసి ధార్మిక వ్యవస్థను విచ్చిన్నం చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కామన్ గుడ్ ఫండ్ అనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారానికి లోబడి ఉంటుంది, కానీ ఇందులో జమ అయిన దేవాలయాల నిధులను మీరు అన్యమతస్థులకు పంచి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మీ పరిపాలన సాగుతోంది. దేవాలయాల విషయంలో మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు బలపడే విధంగా ప్రభుత్వ ఆదేశాలు కనపడుతున్నాయి. అందువల్ల దేవాలయాల అస్తుల విషయంలో ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని ఈ బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. దేవాలయాలకేశఠగోపం పెట్టేందుకు సిద్ధమైన జగన్ సర్కార్- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ 500 కోట్లులక్ష్యంగా దేవాలయాల ఎఫ్డీలను రద్దు చేయమని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలుఇవ్వటం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కెరామకృష్ణ అన్నారు. రాష్ట్రంలోని 15 వేల దేవాలయాల ఫిక్స్ డ్ డిపాజిట్లు రద్దుచేసి,సిజిఎఫ్ కుబదలాయించాలనుకోవడం దుర్మార్గం. జగన్ సర్కార్నిర్ణయంతో ఏపీలోని ఆలయాల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం ఉందన్నారు. గతదేవాదాయశాఖ మంత్రి సిజిఎఫ్ నిధులను మళ్లించినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణజరపాలని డిమాండ్ చేశారు..
ఖాళీ అవుతున్న ఆలయాల బ్యాంకు ఖాతాలు…
రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, వేమూరి రామకృష్ణారావు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏ ఆర్ కే మూర్తి, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన, మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు, పి.వి. ఫణి కుమార్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన మచిలీపట్నం పార్లమెంట్ గౌరవాధ్యక్షుడు, మోపర్తి సుబ్రమణ్యం లు మచిలీపట్నం శిడింబి అగ్రహారంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు… అనాదిగా దేవుని మీద నమ్మకంతో భక్తుల కానుకలు మరియు విరాళాలతో ఆలయాలకి ఫిక్సిడ్ డిపాజిట్లు చేయబడిన మూలధనాన్ని వైసీపీ ప్రభుత్వం తమ ఖాతాలోకి జమ చేసుకుంటోంది అని ఆరోపించారు. దీని వలన ధూపదీప నైవేద్యాలు చాలా ఆలయాలలో జరగటం కష్ట సాధ్యం. దేవుని మీద నమ్మకంతో భక్తులు సమర్పించే కానుకలు మరియు విరాళాలు టెంపుల్ యొక్క అభివృద్ధి కొరకు దేవస్థానంలో ధూప దీప నైవేద్యాలు అంగరంగ వైభవంగా కళ్యాణాలు, ఇతర ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలు జరపడం కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు దేవాలయాల మూలధనాన్ని ఖాతాల నుంచి తీసి ఆ సొమ్మును ప్రభుత్వం తమ ఖాతాలోకి జమ చేసుకోవడం వల్ల ఆలయాల కింద పనిచేసే ఉద్యోగస్తులకు, అర్చకులకు జీతాలు రావటం కూడా ఇకపై గగనమే. వేలాదిమంది ఆలయాల్లో ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడటం ఖాయం దీని తీవ్రంగా ఖండిస్తున్నాం వెయ్యకోట్లు టార్గెట్ గా వైసీపీ ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమాలు ప్రజలు ఎవరు హర్షించరు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒక నమ్మకంతో దేవునికి సేవ చేయాలి కానీ దేవుని సొమ్మునే దోచే విధంగా తయారు కాకూడదు దీని తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం వెంటనే తమ యొక్క ఉద్దేశాన్ని వెనక్కి తీసుకోవాలని తీవ్ర పదజాలంతో డిమాండ్ చేశారు. ఫిక్సిడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయమని ఎండోమెంట్స్ కమీషనర్ ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం. బ్యాంకుల్లో క్యాన్సిల్ చేసిన ఎఫ్ డిల నగదును సిజెఎఫ్ కు జమ చేస్తున్న ఆలయ అధికారులు. సిజిఎఫ్ ఫండ్ ను ఆలయాల జీర్ణోనోద్దారణకు వినియోగించాలి. ఫిక్సిడ్ డిపాజిట్స్ రద్దు చేయడంపై మండిపడుతున్న భక్తులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించాలి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి వినాయక టెంపుల్ 30 లక్షలు, నెల్లూరు జిల్లా మూలస్ధానేశ్వరస్వామి టెంపుల్ 30 లక్షలు, సింగరాయపాలెం సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం 20 లక్షలు, విజయవాడ యనమలకుదురు శివాలయం 30 లక్షలు, వేదాద్రి యోగానంద లక్ష్మీనర్సింహాస్వామి 60 లక్షలు. ఎన్టీఆర్ జిల్లా కోటిలింగాలు 40 లక్షలు..