- కృష్ణ , గుంటూరు, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో అధికం
రాష్ట్రంలో 80 నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ మైనింగ్
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పొల్యూషన్ బోర్డు తనిఖీలు
రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని సుప్రీమ్ కోర్ట్ హితవు
నోరెత్తని అధికారులు వైసీపీ పెద్దల అండదండలు
రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసే నాధుడే లేదు. అధికారబలంతో పాటు ప్రభుత్వ యంత్రాంగ అలసత్వాన్ని పావుగా వాడుకొని అక్రమార్కులు నదీ పరివాహక ప్రాంతాలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. వేల కోట్ల అక్రమార్జన చేస్తున్నారు అంతే కాకూండా ప్రభుత్వ పెద్దల హస్తం ప్రత్యక్షం గా ఉండటంతో ఎవరు ఏమి మాట్లాడలేని పరిస్థితి రాష్ట్రంలో ప్రతి పక్షాలు గగ్గోలు పెడుతూ కోర్ట్ ల దృష్టికి సమస్యను తీసుకువెళ్తున్నా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాఅధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు.దీంతో వేల కోట్ల ప్రజాధనం అవినీతి పెద్దల జేబుల్లోకి నేరుగా వెళ్తున్నా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి.
కృష్ణ, గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు
సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ఎవరేం పట్టించుకోని పరిస్థితి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టేట్ పొల్యూషన్ బోర్డు జాయింట్ ఆపరేషన్ లో విస్తు పోయే నిజాలు వెలుగు లోకి వచ్చాయి 2019 లో నిర్వహించిన ఈ సోదాల్లో ఇసుక అక్రమ తవ్వకాలవల్ల గ్రౌండ్ వాటర్ పూర్తిగా ఇంకిపోవటమే కాకుండా నది పరివాహక ప్రాంతం కోతలకు గురయ్యే ప్రమాదంతో పాటు వరద తాకిడి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని గుర్తించింది.
పెనుమాక ఉండ్రాయుని పాలెం వెంకటాయపాలెం ఉండరాయుని పాలెం లింగాయపాలెం రాయపూడి సూర్య పాలెం గుంటుపల్లి కృష్ణజిల్లాలో ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు బాగా జరుగుతున్నట్టు సమాచారం 25 లక్షల టన్నుల ఇసుక గుంటూరు ప్రాంతం నుండి అదేవిధంగా కృష్ణ జిల్లా నుండి 9 లక్షల టన్నుల వరకు అనుమతులున్నా అంతకంటే ఎక్కువ తవ్వుతూ గ్రౌండ్ లెవెల్ కి 25 అడుగుల మేర తవ్వేస్తుండటం తో ప్రకృతికి మానవాళికి తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఇసుక అక్రమార్కుల ప్రవర్తన ఉంది నామ మాత్రపు కేసులు రాస్తూ చూసి చూడనట్టు ఉండటం తో వారికీ భయం అనేది లేకుండా పోయింది ఎవరైనా అధికారులు అటు వైపు వెళ్తే వారిపై దాడులకు తెగబడటానికి కూడా అక్రమార్కులు వెనకాడటం లేదు.
తిరుపతి విశాఖ శ్రీకాకుళం కడపలో విపరీత తవ్వకాలు
చిత్తూరు జిల్లా తిరుపతి చుట్టుపక్కల చంద్రగిరి వీ కోట మండలం పలమనేరు నియోజకవర్గం నుండి కుప్పం వరకు తీవ్ర మైనింగ్ కొనసాగుతుంది . దీంతో గ్రౌండ్ వాటర్ ఇంకిపోయే పరిస్థితి పెద్దవంక గంగమ్మ యేరు ఇనుమల చెరువు గొనుమాకుల పల్లె లో కూడా ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా ఉంది సుమారు రోజుకు 200 టిప్పర్ల ఇసుక లోడు పైనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి ఇప్పటివరకు 20 ఎకరాల మట్టి పైనే తవ్వేసినట్టు సమాచారం విశాఖ శ్రీకాకుళం శివారు నది పరివాహక ప్రాంతాల్లో తీవ్రంగా తవ్వేస్తున్నారు కల్యాణ లోవ ఏజెన్సీ ప్రాంతాల్లో అదే పనిగా ఇసుక మైనింగ్ చేస్తున్నారు. అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవటం విడ్డురంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి శర్మ విశాఖ లో జరుగుతున్న మైనింగ్ ఫై అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేకుండా పోయిందిశ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వంశధార నాగావళి ప్రాంత పరిదిలో ఇసుక అక్రమ తవ్వకాలు విపరీతం గా జరుగుతున్నాయి ముద్దాడ సింగూరుపొన్నం ఆముదాల వలస తదితర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతుంది. కడప పరిస్థితి చూస్తే అమృతానగర్ పొద్దుటూరు టౌన్ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతూ బెంగుళూరు చెన్నై కు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది శ్రీకాకుళం లో వీ ర్ ఓ ల పైనే దాడి జరిగి వారు భయాందోళనకు గురయ్యే పరిస్థితి.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల పెనాల్టీ
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల పైనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక అక్రమ తవ్వకాలపై పెనాల్టీ విధించింది పొల్యూషన్ బోర్డు అదేవిదం గా కోర్టులు ఎన్ని అక్షింతలు వేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా ఎవరు ఏమిచేయలేని పరిస్థితి 100 కోట్ల పెనాల్టీ నేపథ్యం లో సుప్రీమ్ కోర్ట్ కెళ్ళి సస్పెండ్ ఆర్డర్ తెచ్చుకొని పైకి ఇసుక అక్రమ రవాణా జరగటం లేదని చెప్పుకొనే పరిస్థితి.
ప్రభుత్వ అలసత్వం అక్రమార్కుల వీరంగం
ప్రభుత్వం చూపుతున్న ఈ విధమైన అలసత్వం కారణంతో అక్రమార్కులు రోజురోజుకి రెచ్చిపోతున్నారు ఇసుక అత్యవసరమైనది కావటం తో ఇసుక మాఫియా ఎంత కైనా తెగిస్తున్నారు రాష్ట్రంలో ఇప్పటికే ఇసుక బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. ప్రత్యేకమైన ఇసుక పాలసీ రూపొందించి అక్రమార్కులను అరికట్టి పేద మధ్య తరగతి వారికీ ఇసుక అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుకుంటున్నారు.