కోనసీమ జిల్లా `అంబేడ్కర్ కోనసీమ జిల్లా`గా పేరు మార్పు
రాష్ట్రంలో ఏ ఒక్కరి చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఈ నెల 27న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,594.60 కోట్లను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 82,31,502 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో దాదాపు 42 కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అదే విధంగా 27వ తేదీన అమలు చేయనున్న అమ్మఒడి పథకానికి ఆమోదం తెలిపింది. అంతేకాకుండా సంక్షేమ పథకాల క్యాలెండర్‌లో జూలైలో అమలు చేయనున్న జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపునేస్తం, జగనన్న తోడు పథకాలకు ఆమోదం తెలిపింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా..
కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు సంబంధించి సవరణలు, మార్పులు, చేర్పులుతో కూడిన తుది నోటిఫికేషన్‌ను ఆమోదించింది. కొత్తగా ఏర్పాటు చేసిన బద్వేలు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కొత్తగా 20 పోస్టులు మంజూరు. నెల్లూరు జిల్లా కనుపూరులో మైసూరుకు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్ట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ స్టడీస్ ఇన్ క్లాసికల్ తెలుగు కోసం 5 ఎకరాల స్థలం. సత్యసాయి జిల్లా పెనుకొండలో 63.29 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ యాక్ట్ 1971కు సవరణలతో కూడిన డ్రాప్ట్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఇందుకూరులోని సర్వారాయ సాగర్ రిజర్వాయర్ పేరును కమ్యూనిస్టు యోధుడు నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయర్‌గా మార్పు చేస్తూ.. జల వనరుల శాఖ చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం.