పీఎం నరేంద్రమోదీ బెంగళూరులో అనేక రైలు, రోడ్డు మౌలిక సదుపాయాల పథకాలకు ప్రారంభోత్సవంతో పాటు, వాటిల్లో కొన్ని పథకాలకు ఈ రోజున శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల విలువ 27,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. అంతక్రితం ప్రధాన మంత్రి ఐఐఎస్ సి బెంగళూరులో సెంటర్ ఫార్ బ్రెయిన్ రిసర్చ్ ను ప్రారంభించడంతో పాటు, బాగ్ చీ పార్థసారథి మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు. ఆయన డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్ కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (బిఎఎస్ఇ) యూనివర్శిటీ కొత్త కేంపస్ ను కూడా ప్రారంభించారు. అదే కేంపస్ లో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఆయన 150 ఐటిఐలను టెక్నాలజీ హబ్స్ గా ఉన్నతీకరించగా, వాటిని కూడా దేశ ప్రజలకు అంకితం చేశారు.
కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పాలుపంచుకున్నారు. ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కర్నాటకలో 5 జాతీయ హైవే పథకాలకు, 7 రైల్ వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజున కొంకణ్ రైల్ వే తాలూకు 100 శాతం విద్యుదీకరణ కూడా చెప్పుకోదగినటువంటి ఒక మైలురాయి అని పేర్కొనాలి. ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా కర్నాటకలో యువతకు కొత్త అవకాశాల ను అందించడంతో పాటు, మధ్య తరగతికి, రైతులకు, శ్రమికులకు, నవపారిశ్రామికవేత్తలకు సరికొత్త సదుపాయాలను అందజేస్తామన్నారు. దేశంలో లక్షలాది యువతీయువకులకు బెంగళూరు ఒక కలల నగరం గా ఉంది. ఈ నగరం ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ భావనను ప్రతిబింబిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘బెంగళూరును అభివృద్ధి చేయడం అంటే, లక్షలాది స్వప్నాలను పెంచి పోషించడమని చెప్పాలి. ఈ కారణం గానే గడచిన ఎనిమిదేళ్లలో బెంగళూరు సామర్థ్యాలను పెంపొందింప చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అవిరామంగా కృషి చేస్తోంది’’ అన్నారు.
బెంగళూరును ట్రాఫిక్ జామ్ ల బారి నుంచి విముక్తి ప్రసాదించడం కోసం రైలు, రోడ్డు, మెట్రో, అండర్ పాస్, ఫ్లైఓవర్ల వంటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వంటి ప్రతి సాధ్యమైన ప్రయత్నాలన్నింటినీ ‘డబల్ ఇంజన్’ ప్రభుత్వం చేస్తోంది అని ప్రధాన మంత్రి తెలిపారు. బెంగళూరులోని శివారు ప్రాంతాల ను ఉత్తమమైన సంధానంతో జోడించడాని కి తన ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. గడచిన నాలుగు దశాబ్దాలుగా ఈ విధమైన చర్యల ను గురించిన మాటలు అదే పనిగా సాగుతూ వచ్చాయి, మరి ఇప్పుడు ‘డబల్ ఇంజన్’ ప్రభుత్వంతో ఈ ప్రాజెక్టుల ను ప్రస్తుత హయాంలో పూర్తి చేసేందుకు అవకాశాన్ని ఇచ్చారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టులను సకాలంలో చెంతకు చేరుస్తాము అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. గడచిన 40 ఏళ్లలో పెండింగు పడ్డ ప్రజల స్వప్నాలను రాబోయే 40 నెలల్లో సాకారం చేయడానికి తాను కఠోరంగా శ్రమిస్తానన్నారు.
బెంగళూరు శివారు రైలు పథకం ద్వారా సంధానం బెంగళూరు నగరాన్ని దాని శివారులతో శాటిలైట్ టౌన్ శిప్స్ తోను జత పరుస్తుంది. మరి తత్ఫలితంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి అని ప్రధానమంత్రి అన్నారు. బెంగళూరు రింగు రోడ్డు ప్రాజెక్టు నగరం యొక్క రద్దీని తగ్గిస్తుందన్నారు. గత 8 సంవత్సరాలలో ప్రభుత్వం రైలు సంధానాన్ని సంపూర్ణం గా మార్చివేసే పనిలో నిమగ్నమయ్యింది అని ప్రధాన మంత్రి వివరించారు. భారతీయ రైల్ వే లు వేగవంతంగా, మరింత స్వచ్ఛంగా మారడంతో పాటు, ఆధునికంగా, సురక్షితంగా పౌరులకు అనుకూలంగా రూపుదిద్దుకొంటున్నాయి అని తెలిపారు. ‘‘ఇది వరకు ఆలోచించడానికి కూడా కష్టంగా ఉన్న దేశంలోని కొన్ని ప్రాంతాల కు మేము రైలు ను తీసుకు పోయాము. ఒకప్పుడు విమానాశ్రయాలలో, విమాన ప్రయాణంలో మాత్రమే లభించినటువంటి సదుపాయాలను ప్రస్తుతం ప్రయాణికులకు అందించడానికి ఇండియన్ రైల్ వేస్ ప్రయత్నిస్తోంది. బెంగళూరు లో ఆధునిక రైల్ వే స్టేశన్ కు భారత రత్న సర్ ఎమ్.విశ్వేశ్వరయ్య పేరును పెట్టడం అనేది సైతం దీనికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఏకీకృత బహుళవిధ సంధానం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఈ మల్టీ మోడల్ కనెక్టివిటీ అనే దానికి పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఒక కొత్త ఉత్తేజం లభిస్తోంది అని ఆయన ప్రస్తావించారు. త్వరలో ఏర్పాటుకాబోయే మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఈ దృష్టి కోణంలో ఒక భాగంగా ఉందన్నారు. గతిశక్తి యొక్క స్ఫూర్తితో చేపట్టేటటువంటి ఆ తరహా ప్రాజెక్టులు యువత కు ఉపాధిని కల్పిస్తాయని, ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ ను కూడా పటిష్టం చేస్తాయన్నారు.
బెంగళూరు సాఫల్య గాథ 21వ శతాబ్దాని కి చెందిన భారతదేశాని కి ‘ఆత్మనిర్భర్ భారత్’ గా అయ్యేందుకు ప్రేరణను ఇస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం గనుక సదుపాయాలను సమకూర్చి, పౌరుల జీవితాల లో జోక్యాన్ని కనీస స్థాయి కి తగ్గించిన పక్షం లో భారతదేశ యువత ఏమి చేయగలుగుతుంది అనేదాన్ని బెంగళూరు చాటి చెప్పింది. బెంగళూరు దేశ యువతీయువకుల కలల నగరంగా ఉంది. మరి దీని వెనుక నవపారిశ్రామికత్వం, నూతన ఆవిష్కరణలు, సార్వజనిక రంగాన్ని, అలాగే ప్రైవేటు రంగాన్ని సరి అయిన విధం గా వినియోగించుకోవడం ఈ అంశాలు అన్నీ ఉన్నాయి అని ఆయన అన్నారు. భారతదేశం లో ప్రైవేటు వ్యాపార సంస్థల భావన పట్ల అంతగా గౌరవం లేనటువంటి వారికి బెంగళూరు ఒక పాఠం గా నిలచింది అని ఆయన అన్నారు. 21వ శతాబ్ది కి చెందిన భారతదేశం ఎలాంటిది అంటే, అది సంపద ను సృష్టించే వారి, ఉద్యోగాలను అందించేవారి, నూతన ఆవిష్కర్తలకు చెందిన భారతదేశం అని ఆయన అభివర్ణించారు. ప్రపంచం లో అత్యంత యువ దేశంగా ఇది భారతదేశం యొక్క సంపద, ఇంకా శక్తి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఎమ్ఎస్ఎమ్ఇ కి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. ఎస్ఎమ్ఇ యొక్క నిర్వచనంలో మార్పు చోటు చేసుకోవడం తో వాటి వృద్ధికి కొత్త దారులు బార్లా తెరచుకొన్నాయి అని ప్రధానమంత్రి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ భావన పట్ల విశ్వాసాని కి ఒక సూచిక గా భారతదేశం 200 కోట్ల రూపాయల వరకు నిల్వ కలిగిన కాంట్రాక్టులలో విదేశీ ప్రాతినిధ్యాన్ని రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల ను 25 శాతం స్థాయి వరకు కొనుగోళ్ళ ను ఎమ్ఎస్ఎమ్ఇ నుంచి జరపాలి అని ఆదేశించడమైంది అని ఆయన వివరించారు. జిఇఎమ్ పోర్టల్, ఎమ్ఎస్ఎమ్ఇ విభాగాని కి ఒక గొప్ప సంధాన కర్త గా నిరూపణ అవుతోంది అని అన్నారు.
స్టార్ట్-అప్ రంగం లో ప్రధానమైన విజయాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇదివరకటి దశాబ్దల లో బిలియన్ డాలర్ కంపెనీలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది వేళ్ళపై లెక్కపెట్టవచ్చును అన్నారు. అయితే, ఒక 8 సంవత్సరాలలో బిలియన్ డాలర్ కంపెనీల ను 100 కు పైగా సృష్టించడం జరిగింది. అంతేకాకుండా, ప్రతి నెలా కొత్త కంపెనీలను ఈ జాబితా కు చేర్చడం జరుగుతోంది అని ఆయన అన్నారు. మొదటి 10,000 స్టార్ట్-అప్ లు 2014వ సంవత్సరం అనంతరం 800 రోజుల వ్యవధి లో ఏర్పాటు కాగా, ప్రస్తుతం అదే సంఖ్య లో స్టార్ట్-అప్ లు 200 రోజుల కన్నా తక్కువ వ్యవధి లో జత అయ్యాయి అని ప్రధాన మంత్రి వెల్లడించారు. గత 8 సంవత్సరాల లో ఏర్పాటైన యూనికార్న్ యొక్క విలువ దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది అని ఆయన అన్నారు.
ఒక సంస్థ ప్రభుత్వాని కి చెందినదా, లేక ప్రైవేటు రంగం లో ఉన్నదా అనే విషయంలో చూసినట్లయితే ఆ రెండూ కూడా దేశం యొక్క ఆస్తులే అని తాను స్పష్టం గా నమ్ముతానని ప్రధాన మంత్రి అన్నారు. అంటే ప్రతి ఒక్కరికీ సమానమైన ఆటను ఆడే అవకాశాల ను అందించాలి అని ఆయన పేర్కొన్నారు. దేశంలో యువతీ యువకులు వారి యొక్క దృష్టి కోణాన్ని నిగ్గు తేల్చుకోవాలని, వారి ఆలోచనల ను ప్రపంచ శ్రేణి కేంద్రాలలో నిరూపించుకోవాలని ఆహ్వానించారు. యువత కు ప్రభుత్వం వేదిక ను కల్పిస్తోంది అని చెప్పారు. ప్రభుత్వ కంపెనీలు కూడా సమానమైన అవకాశాలు లభించే మైదానంలో పోటీ పడతాయి అని చెప్తూ, ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ప్రాజెక్టుల వివరాలు
బెంగళూరు సబర్బన్ ప్రాజెక్టు బెంగళూరు నగరాన్ని ఆ నగర శివారులతో, శాటిలైట్ టౌన్ శిప్ లతో కలుపుతుంది. ఈ ప్రాజెక్టు కు నిర్మాణ వ్యయం 15,700 కోట్ల రూపాయల కు పైగానే; దీనిలో భాగం గా 4 కారిడార్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాగా, మొత్తం రూట్ నిడివి 148 కిలో మీటర్ లకు పైగా ఉంటుంది. ప్రధానమంత్రి సుమారు 500 కోట్ల రూపాయల వ్యయం అయ్యే బెంగళూరు కంటోన్మెంట్ పునరభివృద్ధి పథకాని కి, 375 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే యశ్వంత్ పుర్ జంక్షన్ రైల్ వే స్టేశన్ పునరభివృద్ధి పథకాని కి శంకుస్థాపనలు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి భారతదేశం లో మొట్టమొదటి ఎయర్ కండిశన్ సదుపాయం కలిగిన రైల్ వే స్టేషన్ సర్ ఎమ్.విశ్వేశ్వరయ్య రైల్ వే స్టేషన్ ని , బయ్యప్పనహళ్ళి లో ఏర్పాటు కాగా, ఆ రైల్ వే స్టేషన్ ను దేశ ప్రజలకు అంకితం చేశారు. సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య రైల్ వే స్టేశన్ ను ఒక ఆధునిక విమానాశ్రయం తోవలో మొత్తం ఇంచుమించు 315 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పరచడం జరిగింది. కొంకణ్ రైలు మార్గం లో మహారాష్ట్ర లోని రోహా నుంచి కర్నాటకలోని తోకూర్ వరకు (దాదాపు గా 740 కిలో మీటర్ ల మేర) 100 శాతం విద్యుదీకరణ పనులు పూర్తి అయిన రైలు మార్గాన్ని ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ మార్గాని కి ప్రారంభ సూచకం గా ఉడిపి, మడగావ్, మరియు రత్నగిరి ల నుంచి సాగే ఎలక్ట్రిక్ ట్రైన్స్ కు ఆయన జెండాను చూపారు. 1280 కోట్ల రూపాయల కు పై చిలుకు వ్యయం తో కొంకణ్ రైల్ వే లైను కు విద్యుదీకరణ జరిగింది. రెండు రైల్ వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టులు.. అర్సికెరె నుంచి తుమకురు (సుమారు 96 కిమీ) మరియు ఎలహంక నుంచి పెనుకొండ (దాదాపుగా 120 కిమీ) లను కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు. ఆయా మార్గాలలో ప్రయాణికుల రైళ్ళ కు మేము (ఎమ్ఇఎమ్ యు) సర్వీసు కు ఆయన ప్రారంభ సూచక జెండాను చూపారు. ఈ రెండు రైలు మార్గాల డబ్లింగ్ పథకాలకు వరుసగా 750 కోట్ల రూపాయల కు పైచిలుకు మరియు 1100 కోట్ల రూపాయల వ్యయం అయింది.
ప్రధానమంత్రి బెంగళూరు రింగు రోడ్డు ప్రాజెక్టు తాలూకు రెండు సెక్షన్ లకు కూడా శంకుస్థాపన చేశారు. 2280 కోట్ల రూపాయల పైచిలుకు వ్యయం తో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు నగరాని కి వాహన రాకపోకల రద్దీని తగ్గించడంలో సహాయకారి కాగలదు. ప్రధాన మంత్రి మరికొన్ని రోడ్డు ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు. వాటిలో ఎన్ హెచ్-48 నీలమంగళ- తుమకూరు సెక్షను ను 6 దోవలు కలిగి ఉండేదిగా విస్తరించడం; ఎన్ హెచ్-73 లోని పుంజల్ కట్-చర్ మాడి సెక్షను విస్తరణ పనులు; ఎన్ హెచ్- 69 లో ఒక సెక్షను ను ఉన్నతీకరించడం వంటి భాగంగా ఉన్నాయి. ఈ ప్రోజెక్టులకయ్యే మొత్తం వ్యయం దాదాపుగా 3150 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రధానమంత్రి మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ కు కూడా పునాది రాయిని వేశారు. ఈ పార్కును సుమారు 1800 కోట్ల రూపాయల వ్యయంతో బెంగళూరు నుంచి దాదాపు 40 కిమీ దూరంలో ఉన్న ముద్దలింగనహళ్ళిలో ఏర్పాటుచేయడం జరుగుతోంది. ఈ లాజిస్టిక్స్ పార్క్ రవాణా, హ్యాండ్లింగ్ , సెకండరీ ఫ్రైట్ వ్యయాలను తగ్గించడంలో తోడ్పడనుంది.