యూకేలోని లారా యంగ్ అనే మహిళ అదనపు సంపాదన కోసం ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఎలాంటి హంగామా లేకుండా, తన భర్త నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. అంతే, ఆమె ‘రెంట్ మై హ్యాండీ హస్బెండ్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. తన భర్తను ఇతర మహిళలకు అద్దెకు ఇవ్వొచ్చన్న మాట.
లారా భర్త, జేమ్స్ ఉద్యోగాలలో స్పెషల్ టాలెంట్‌తో పనిచేస్తారు. వారి ఇంటిని నైపుణ్యాలతో ప్రత్యేకంగా మార్చారు. జేమ్స్ కస్టమ్ బెడ్‌లను నిర్మించడం వంటి పనులతో బకింగ్‌హామ్‌షైర్ ఇంటిని మార్చేశాడు. డైనింగ్ టేబుల్ తయారీ, పెయింటింగ్, డెకరేటింగ్, టైల్ వేయడం, కార్పెట్ వేయడంలో కూడా నేర్పును సాధించాడు. “అతను ఇల్లు, తోట చుట్టూ ఉన్న ప్రతిదానిలో ప్రత్యేకత. కాబట్టి ఆ నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి అతనిని ఎవరినైనా అద్దెకు ఎందుకు తీసుకోకూడదని అనుకున్నానని? చెప్పింది” లారా. “చాలా మంది ఆసక్తి చూపించారు. కొంతమందికి తప్పుడు ఆలోచన వచ్చింది. జేమ్స్‌ను పూర్తిగా వేరొకదాని కోసం నియమించుకుంటున్నానని భావించారు! అతని నుంచి డబ్బు సంపాదించడం కోసం మాత్రమే అలా చేయడం లేదు. నైపుణ్యాలను వినియోగించడానికి” అని ఆమె వివరించింది.
ఆ వెంటనే ఫేస్‌బుక్ ఇతరాత్ర సోషల్ మీడియా యాప్స్, స్నేహితుల సహాయంతో గట్టి ప్రచారమే చేసింది. అయితే, మనం ముందుగా భావించినట్లే.. కొందరు ‘డర్టీ మైండ్’తో ఆలోచించారు. ‘A’ పనులైనా చేస్తాడా? నీ భర్త అనే కామెంట్స్ ఆమెను ఆలోచింజేశాయి. కానీ, ఆమె తలచుకున్న పనికి మాత్రం ఆ కామెంట్స్ ఆటంకం కాలేదు. ‘‘మీకు ఇంటి పనిలో సాయం ఉంటాడు. చిన్న పనులను చక్కబెడతాడు. తప్పకుండా నా భర్త తన తీరుతో మెప్పిస్తాడు’’ అంటూ లారా తన భర్తను ప్రమోట్ చేసుకుంది.
కొంతమంది మహిళలకు లారా ఐడియా బాగా నచ్చింది. ‘‘మీ భర్తను అద్దెకు తీసుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అంటూ ఆమెను ప్రోత్సహించారు. వాస్తవానికి జేమ్స్ ఒక మాజీ వేర్‌హౌస్ వర్కర్. కొన్నేళ్ల కిందట అతడు లారాకు, వారి ముగ్గురు పిల్లలతో తోడుగా ఉండటం కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవలసి వచ్చింది. జేమ్స్ పిల్లల్లో ఇద్దరు ఆటిస్టిక్‌తో బాధపడుతున్నారు. వారికి సాయంగా ఉంటూనే చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. జేమ్స్‌ను అద్దెకు తీసుకొనే మహిళ.. అతడిని ఇంటికి తీసుకెళ్లి పనులు చేయించుకోడానికి 35 పౌండ్లు (రూ.3352) చెల్లించాలి. వికలాంగులకు, విద్యార్థులకు, 65 ఏళ్లు పైబడిన పెద్దవాళ్లకు మాత్రం తక్కువ ధరలోనే జేమ్స్ తన సేవలు అందిస్తాడు. ఈ ఉద్యోగం ఏదో బాగుంది కదూ.