“క్రాక్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రవితేజ ‘ఖిలాడి’తో డిజాస్టర్ అందుకున్నాడు. మరోసారి కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తూ నటించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. చాన్నాళ్ల తర్వాత వేణు తొట్టెంపూడి మళ్ళీ తెరపై కనిపించిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. మరి సినిమా అయినా ఆకట్టుకుందో లేదో చూద్దాం.
కథ
చిత్తూరు జిల్లా కలెక్టర్ రామారావు (రవితేజ) చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. తాను నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా నమ్మే రామారావు. తన భర్త మిస్సింగ్ అంటూ వచ్చిన దీప (రజిషా విజయన్)కు సహాయం చేయడం కోసం రంగంలోకి దిగిన రామారావుకి ఊహించని విషయాలు తెలుస్తాయి. ఇంతకీ దీప భర్తను కిడ్నాప్ చేసింది ఎవరు ? రామారావు తెలుసుకున్న నిజాలు ఏమిటి ? అనేది ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథాంశం.
నటీనటుల పనితీరు
రవితేజ కెరీర్ లో చేసిన బ్యాడ్ ఫిలిమ్స్ & క్యారెక్టర్స్ లిస్ట్ లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా చేరిపోతుంది. ఓ సాధారణ గవర్నమెంట్ ఉద్యోగికి ఈ రేంజ్ పవర్స్ ఉంటాయా అని అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే క్యారెక్టర్ బిహేవియర్ కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. వేణు తొట్టెంపూడిని చాన్నాళ్ల తర్వాత మళ్ళీ చూడడం ఆనందంగా ఉన్నా ఆయన క్యారెక్టర్ కి సరైన జస్టిఫికేషన్ లేకపోవడం మాత్రం బాధాకరం. హీరోయిన్స్ సెలక్షన్ లో రవితేజ టేస్ట్ బ్యాడ్ అనేది ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. ఈ చిత్రంతో మరోమారు అది రుజువైంది. పర్సనాలిటీ కాస్త బాగున్న రాజిషాను లవర్ క్యారెక్టర్లా ఒక పాటకు పరిమితం చేసి.రవితేజతో ఏమాత్రం కెమిస్ట్రీ సింక్ అవ్వని దివ్యాంశను వైఫ్ గా చూపించి జనాల్ని నిరాశపరిచారు. ఇక తమిళ నటుడు జాన్ విజయ్, తనికెళ్ళ భరణీ పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు
సామ్ సి.ఎస్ అందించిన పాటలు సినిమాకి పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఒక్కటంటే ఒక్క పాట కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. నేపధ్య సంగీతం మాత్రం పర్వాలేదు అనిపించుకున్నాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమాకి సేవింగ్ గ్రేస్. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సోసోగా ఉన్నాయి. దర్శకుడు శరత్ మండవ రాసుకున్న కథలో దమ్ము ఉంది కానీ. ఆ కథను తెరకెక్కించిన విధానం మాత్రం బాగోలేదు. స్క్రీన్ ప్లే & డైలాగ్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ తరహా థ్రిల్లర్ ను తెరకెక్కించడానికి కావాల్సింది ఆకట్టుకునే కథనం. ఆ కథనమే మిస్ అయ్యేసరికి. అటు రవితేజ ఫార్మాట్ ఎంటర్టైన్మెంట్ లేక సినిమాలో కంటెంట్ లేక ‘రామారావు ఆన్ డ్యూటీ’ చతికిలపడింది.