తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ, మ్యాక్సీ నడిపే డ్రైవర్లకు సంవత్సరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందచేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం రకరకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది .ఒక్కొక్క సామాజిక వర్గానికి ..ఒక్కొక్క పథకం కింద ప్రజలకు.. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టితే.. ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావించింది. వీటిలో కొన్ని అమ్మఒడి ..చేయూత ..ఆసరా ..రైతు భరోసా వాహన మిత్ర…
వాహన మిత్ర లక్ష్యం ఇదే
ఏపీ ప్రభుత్వం వాహన డ్రైవర్లకు ప్రతి సంవత్సరము పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నది .వాహన మైంటెన్స్ ఖర్చులు ..ఇన్సూరెన్స్ ..ఫిట్నెస్ సర్టిఫికెట్స్ వంటి ఇతర డాక్యుమెంట్లు పొందడానికి ..ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. దీనికి అర్హులు సొంత ఆటో ..టాక్సీ ..మ్యాక్సీ కలిగిన డ్రైవర్లు ..వీరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది .
పథకానికి అర్హులు
కచ్చితంగా 18 సంవత్సరాలకు పైబడి వయసు కలిగి ఉండాలి .ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం కలిగి ఉండాలి .రేషన్ కార్డులో పేరు నమోదయి ఉండాలి .లబ్ధిదారుల పేరుతో ఆటో ..టాక్సీ ..మ్యాక్సీ ఉండాల్సిందే .పేద కుటుంబాలకు /తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది..
ఏఏ డాక్యుమెంట్లు కావాలి
ఆధార్ కార్డు.. డ్రైవింగ్ లైసెన్స్.. తెల్ల రేషన్ కార్డు.. వాహన పేపర్లు కచ్చితంగా యజమాని పేరుతో కలిగి ఉండాలి.. ఇన్కమ్ సర్టిఫికెట్ ..బ్యాంక్ అకౌంట్ ఉండాలి .అన్ని లబ్ధిదారుని పేరుతోనే ఉండాలి..
పథకంలో ఎలా చేరాలి
వైయస్సార్ వాహన మిత్ర పథకంలో చేరాలనుకునే వారు ..ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం ఏపీ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి .హెచ్టిటిపిఎస్:/ ఏ పి ట్రాన్స్ఫోర్ట్. ఆర్గనైజేషన్/ ద్వారా మీరు వెబ్సైట్లోకి వెళ్లాలి. తర్వాత మీకు కుడివైపున ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫైనాన్స్ అసిస్టెన్స్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి .అప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది .ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ సెక్షన్ లోకి వెళ్లి అన్ని వివరాలు అందించాలి ..తర్వాత సబ్మిట్ చేయాలి ..అప్లికేషన్ ఐడి ..పాస్వర్డ్ వస్తాయి వీటిని భద్రపరుచుకోవాలి..
వాహన మిత్ర లోపాలు
సరైన లబ్ధిదారుల ఎంపికలలో ప్రభుత్వం చాలా ఆలసత్వాన్ని ప్రదర్శిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు .ఈ వాహన మిత్ర పథకంలో అర్హులకు కొన్ని జిల్లాలలో ఈ పథకం అందడం లేదు ఉదాహరణకు బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్రలో.. అనంతపురం.. తిరుపతి జిల్లాలలో కూడా ఈ పథకం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి .ఇప్పటికైనా రాజకీయ ఒత్తిడి.. ప్రలోభాలకు అధికారులు లోబడకుండా ఉండాలని.. అలాగే టెక్నికల్ పొరపాట్లను సరిచేసి అర్హలకు ఈ పథకం పూర్తిస్థాయిలో అందజేయాలని.. పౌర సంక్షేమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..