Connect with us

Hi, what are you looking for?

Opinion

రాష్ట్రపతి ఎన్నికలు – వ్యూహాత్మక ఎత్తుగడలు ?

ఒక దేశ అభ్యున్నతిని ప్రగతి పదాన్ని ఖచ్చిత అంచనా వేయాలంటే ఆ దేశ మహిళల స్వేచ్ఛా గమనాన్ని బట్టి వారి పురోగతిని బట్టి అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మాటలను మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది..

Share

ఒక దేశ అభ్యున్నతిని ప్రగతి పదాన్ని ఖచ్చిత అంచనా వేయాలంటే ఆ దేశ మహిళల స్వేచ్ఛా గమనాన్ని బట్టి వారి పురోగతిని బట్టి అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మాటలను మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రపతి ఎన్నికల వేళ బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడలను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో పాలించిన పార్టీలు మహిళను రాష్ట్రపతి గా నియమించి మహిళా సాధికారతకు పెద్ద పీట వేశామని చెప్పిన నేపథ్యంలో మోడీ నాయకత్వం లో అధికారం లోకి వచ్చిన బీజేపీ దళిత నేపథ్యం ఉన్న రాంనాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి రాష్ట్ర పతి అభ్యర్థుల విషయం లో బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడలను అనుసరిస్తుందని చెప్పకనే చెప్పారు దేశ ప్రతిష్టకు ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబందించిన విషయం కావటం తో ఇప్పుడు అందరి కళ్ళు బీజేపీ అనుసరించే వ్యూహాలపైనే ఆసక్తి నెలకొంది
రాష్ట్రపతి ఎన్నికలు – చరిత్ర
దేశం లో 15 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరగగా అందులో నీలం సంజీవ రెడ్డి ఎన్నిక మాత్రమే ఏకగ్రీవంగా జరిగింది మిగిలినవన్నీ ఎన్నిక జరిగిన దాఖలాలే ఉన్నాయ్ అదేవిదం గా తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఒక్కరే రెండు సార్లు రాష్ట్రపతి పదవిని చేపట్టారు మన తెలుగు వారికీ సంబంధించి సుప్రీమ్ కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోక సుబ్బారావు తన ప్రధాన న్యాయమూర్తి పదవి ఇంకా మూడు నెలలు ఉండగానే రాజీనామా సమర్పించి జాకీర్ హుస్సేన్ ఫై పోటీ చేసి ఓడిపోవటం జరిగింది ఐతే 1969 లో జాకీర్ హుస్సేన్ ఆకస్మిక మరణం తో మధ్యంతర ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమయం లో ఉప రాష్ట్రపతి వి వి గిరి తాత్కాలిక రాష్ట్రపతి గా వ్యవహరించారు తర్వాత రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలనీ నిశ్చయించుకొని పదవికి రాజీనామా చేయటం తో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతి గా నియమయించబడ్డారు అదేవిధంగా రాష్ట్రపతి గా పని చేసి తెలుగు మాట్లాడే కుటుంబాల్లో జన్మించి తమిళనాడు లో స్థిరపడిన వారిలో సర్వేపల్లి రాధా కృష్ణ వి వి గిరి ఉన్నారు ఒకసారి రాష్ట్రపతి ఐన వారు ఎన్ని సార్లయినా ఆ పదవికి పోటీ చేయవచ్చు ఐతే రాజేంద్రప్రసాద్ తప్ప మరెవరు రెండో సారి ఆ పదవికి పోటీ చేయలేదు స్వతంత్ర భారత దేశ చరిత్రలో రాష్ట్రపతి ఎన్నికకు రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించాల్సిన అవసరం ఒకే ఒక్కసారి ఎదురయింది అప్పటి అధికార కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవ రెడ్డి కాగా ఆయన్ని ఓడించటానికి వి వి గిరి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు విచిత్రం ఏమిటంటే పాలక పార్టీ అభ్యర్థి నీలం సంజీవరెడ్డి ని ఇందిరా గాంధీ సమర్ధించకపోవటం తో ప్రతిపక్షాలైన జనసంఘ్ పార్టీలు నీలం సంజీవ రెడ్డి కి మద్దతు నిచ్చాయి దీంతో ఇందిరా గాంధీ పరోక్షం గా స్వతంత్ర అభ్యర్థి ఐన వి వి గిరి కి మద్దతు తెలపటం తో వి వి గిరి రాష్ట్రపతి గా ఎన్నికయ్యారు తదనంతరం పార్టీ ని లెక్క చేయకుండా ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించటం తో ఒక్కసారిగా దేశ రాజకీయాలు మారిపోయాయి తదనంతరం 1977 లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోగా నీలం సంజీవ రెడ్డి రాష్ట్రపతి గా ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు అప్పటి దేశ పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన తన జీతం లో 70 శాతం కోత విధించారు
రాష్ట్రపతి ఎన్నిక – ఓటు విలువ లెక్కింపు
రాష్ట్ర పతి పదవి కాలం ముగిసే ముందు 60 రోజుగాని ఆ తర్వాత గాని షెడ్యూల్ జారీ చేయవచ్చు లోక్ సభ రాజ్యసభ సెక్రటరీ జనరల్ లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు అదేవిదం గా అన్ని రాష్ట్రాల్లో స్టేట్ రిటర్నింగ్ అధికారులు ఉంటారు నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎలెక్టోరల్ కాలేజీ లో 50 మంది ప్రతిపాదించాలి మరో 50 మంది బల పరచాలి డిపాజిట్ 15000 చెల్లించాల్సి ఉంటుంది
ఓటింగ్ ప్రక్రియ
ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రపతి ని ఎలెక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుందన్న సంగతి మనకు తెలిసిందే ఎమ్మెల్యే లు ఎంపీ లు మొత్తం కలిపి ప్రస్తుతం ఇందులో 4809 మంది సభ్యులు ఉండగా వారి ఓటు విలువ 1086431 లోక్ సభ రాజ్య సభ మరియు శాసన సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది నామినేటెడ్ సభ్యులు శాసన మండలి సభ్యులకు ఆ ఓటు హక్కు ఉండదు వోటింగ్ మార్క్ చేయటానికి ప్రత్యేక మైన పెన్ ను ఎన్నికల సంఘం ఇస్తుంది
లెక్కింపు 
ఓట్ల లెక్కింపు విషయానికి వచ్చే సరికి ఎమ్మెల్యే ల కు సంబంధించి మొత్తమ్ అసెంబ్లీ సీట్లను పరిగణలోనికి తీసుకోని విలువను లెక్కిస్తారు అప్పటి రాష్ట్ర జనాభాను ఎమ్మెల్యే ల సంఖ్య ను వెయ్యి చే గుణించగా వచ్చిన సంఖ్యతో భాగిస్తారు ఇలా వచ్చిన ఫలితాన్ని ఎమ్మెల్యే సంఖ్యచే గుణించి ఆ రాష్ట్ర మొత్తం ఓటు విలువగా నిర్దారిస్తారు ఆ మేరకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రము ఓటు విలువ ఎక్కువ కలిగి ఉంది సిక్కిం అతి తక్కువ కలిగి ఉంది అదే విధం గా ఒక్కో ఎంపీ ఓటు విలువ 700 గా నిర్దారించారు
ఎస్టీలకు పెద్ద పీట వేయనున్నారా ?
మైనారిటీ మహిళా మరియు దళిత లకు ప్రాధాన్యతను ఇచ్చిన నేపథ్యం లో ఇప్పుడు తాజా గా ఎస్టీ లకు ప్రాధాన్యత ఇస్తారా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది ఇందులో ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రస్తుత ఛత్తీస్ గడ్ గవర్నర్ అనసూయ ఉయుకెల్లో కు అవకాశం ఇస్తారా లేదా మైనారిటీ పేరు తెరపైకి తెస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం ఏది ఎలా ఉన్నాబీజేపీ తన కచ్చితమైన అవగాహనను పార్టీ భవిష్యత్ కోసం ఈ ఎన్నికలను వ్యూహాత్మకంగా వాడుకుంటుందనటం లో ఎటువంటి సందేహం లేదు.

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Alluri Seetharama Raju

Prediksi forum Syair cambodia Hari Ini 2023     Forum syair cambodia 2023, kode syair cambodia hari ini, code syair cambodia bd, prediksi cambodia...

Lingual Support by India Fascinates