ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. కార్తీ, జయం రవి పలు కీలక పాత్రలను పోషించారు. 995లో పబ్లిష్ అయిన కల్కి క్రిష్ణమూర్తి ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 10వ శతాబ్దాంలో చోళ సామ్రాజ్యంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో చిత్రం విడుదల కానుంది. సెప్టెబర్ 30న సినిమాను రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు.
ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చిత్రానికి సంబంధించి పోస్టర్స్, టీజర్ ను లాంచ్ చేశారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సెల్వం అనే ఓ న్యాయవాది మాత్రం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో చోళులను, చోళ రాజవంశాన్ని తప్పుగా చూపించారని ఆరోపించారు. కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో తాజాగా విక్రమ్ కు, దర్శకుడు మణిరత్నంకు కోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. విక్రమ్ పోషించిన ఆదిత్య కరికాలన్ పాత్రకు టీజర్ లో నుదిటిపై బొట్టు లేదని, పోస్టర్లలో మాత్రం ఉందని తెలిపారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత రీచ్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ ఆడియో, డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ అమోజాన్ ప్రైమ్ వీడియో మూవీ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. రూ.500 కోట్లతో తమిళ ఇండస్ట్రీలోనే తొలిసారిగా రూపుదిద్దుకుంటున్న భారీ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’. రిలీజ్ కు ముందే హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. విజువల్స్, బీజీఎం అద్భుతంగా ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా సంస్థ, మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ సంయుక్తంగా సినిమాను తెరకెక్కిస్తున్నాయి. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు.