రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు ప్రధాని మోడీ, అమిత్‌షా. ఈ విషయాన్ని జనసేనాని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనను ఆహ్వానించిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపిన జనసేనాని తప్పనిసరిగా హాజరుకావాల్సిన చారిత్రాత్మక కార్యక్రమానికి ఆరోగ్య కారణాల రీత్యా వెళ్లలేకపోతున్నందుకు చింతిస్తున్నానన్నారు. నిష్కంళకుడైన రామ్‌నాథ్ కోవింద్ తన ఐదేళ్ల పాలన కాలంలో ఎలాంటి పొరపొచ్చాలకు తావు లేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆయనలోని రాజనీతజ్ఞతకు నిదర్శనమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు జనసేనాని అభినందనలు తెలిపారు. ఇక ఇటీవల కోనసీమ జిల్లా మండపేటలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించిన జనసేనాని ఆ తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. దీని కారణంగా ఈ ఆదివారం జరగాల్సిన జనసేన జనవాణి కార్యక్రమాన్ని సైతం రద్దు చేశారు.
ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి కృతజ్ఞతలు – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/ib3hqGObqC
— JanaSena Party (@JanaSenaParty) July 21, 2022