అధికార వైసీపీ ప్రభుత్వం విధానాల మీద ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్టూన్ వార్ రోజు రోజుకు ప్రజాదరణ పొందుతుంది. అంతే కాక కార్టూన్ల ద్వారా ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నిస్తున్న విధానం ప్రజలను ఆకట్టుకుంటుంది. ఈ కార్టూన్లు ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.
జనసేన అధినేత తాజాగా అధికార వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం తీసుకొని వచ్చిన ఫేస్ రికగ్నిషన్ యాప్ మీద ట్విట్టర్ వేదికగా ఒక కార్టూన్ ని విడుదల చేశారు. ఆ కార్టూన్ ద్వారా ఉపాధ్యాయుల పరిస్థితిని హస్యభరితంగా మరియు ఆలోచింప చేసే విధంగా చూపించారు. ఆ కార్టూన్ లో ఉపాద్యాయులు యాప్ ద్వారా హాజరు వేపించుకోవడానికి సిగ్నల్స్ కోసం పాట్లు పడుతున్నట్లు మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చినట్లు చూపించారు.‘‘పాపం వాళ్లు స్కూల్ కి రాగానే పిల్లలకు పాఠాలు చెప్పుకునేటోళ్లు, అదేదో యాపట, దాని సిగ్నల్ కోసం చెట్టుకొకరు, పుట్టకొకరు అట్టా తిరుగుతున్నారు సార్’ అని అటెండర్ సీఎం జగన్ కి చెబుతున్నట్లుగా ఆ కార్టూన్ ఉంది.
అంతేకాకుండా అధికార వైసీపీ ప్రభుత్వం ఉపాద్యాయులలో జవాబుదారీతనం తీసుకొని రావడానికి మరియు పాఠశాలలో వారి పని తీరు తెలుసుకోవడానికి ఉపాధ్యాయుల మొబైల్స్ లో యాప్ డౌన్లోడ్ చేయాలని బలవంతం చేసింది. అదే విధంగా ఎమ్మెల్యేల మరియు ఎంపీ ల కార్యక్రమాల్ని ట్రాక్ చేయడానికి, పనితీరు తెలుసుకోవడానికి కూడా వైసీపీ ప్రభుత్వం ఒక యాప్ నీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జవాబుదారీతనం అనేది కేవలం ఉపాధ్యాయులకు ఉంటే సరిపోదు అది ప్రజా ప్రతినిధులకు కూడా ఉండాలని ట్వీట్ చేశారు.
YCP Govt forced School teachers to download an APP on their mobile phone to track down their performance at school to bring accountability; & in same manner citizens should also develop an APP to track down our MLAs & MPs activities. Accountability is not just one way YCP Govt.. pic.twitter.com/DMnmMI7gNb
— Pawan Kalyan (@PawanKalyan) August 17, 2022
కరోనా కారణంగా బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, సమయ పాలన తెలుసుకోవడం కోసం తీసుకొని వచ్చిన “ఫేస్ రికగ్నిషన్” తీవ్ర విమర్శలకు దారితీసింది.ఉదయం 9 గంటలకల్లా ఖచ్చితంగా పాఠశాలకు వచ్చి యాప్ ద్వారా హాజరు వేయాలి లేకపోతే ఆ రోజు శెలవు గా ప్రకటిస్తారు, అలాగే సెలవులకు సంబందించిన సమాచారం కూడా యాప్ లోనే అప్లై చేసుకోవాలని విద్యా శాఖ ప్రకటించింది. దీనిమీద ప్రభుత్వ ఉపాద్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.