ప్రజా సమస్యలపై పోరాటాలు, సంస్థాగతంగా పార్టీ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులతో … బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సూచించారు. విజయవాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన NTR జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశంలో శ్రీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్ని మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలన్నీ కూడా 3-5 పోలింగ్ బూత్ లతో కలిపి ఏర్పాటు చేసిన @ శక్తి కేంద్రం ఆధారంగా క్రియాశీలకంగా ఉండాలన్నారు. క్వాలిటీ పరంగా పెరగాలని సూచించారు. మండల కార్యవర్గ సమావేశం పటిష్టంగా అమలు జరగాలన్నారు. అన్ని పోలింగ్ బూత్ స్థాయి పార్టీ భాధ్యులకు ఓటర్ల జాబితాలు అందించి, ప్రతి వందమంది ఓటర్లకు ఒక పన్నా ప్రముఖ్ @ భాధ్యున్ని కేటాయించి, ఇంటింటికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అమలు, వాటి ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వ స్పందన కార్యక్రమం’లో ప్రజలతో కలసి పార్టీ నేతలు “శక్తి కేంద్రం ఆధారంగా వినతి పత్రాలు సమర్పించాలన్నారు.
శక్తి కేంద్రం పరిధిలో అంగన్వాడీ కేంద్రాల తనఖి చేసి, ఇచ్చే ఆహార పదార్థాలను ఇస్తున్నారా లేదా ? పరిశీలించాలన్నారు. 2.5 కేజీల పౌష్ఠిక ఆహారం,కోడిగుడ్లు ఇతర ఆహారం. గర్భిణీ స్త్రీలకు ఆహారం పాలు పౌష్ఠిక ఆహారం ఇస్తున్నారో లేదో పరిశీలించుకోవాలన్నారు. శక్తి కేంద్రం పరిధిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతి మాసం చివరి ఆదివారం నిర్వహించే, మనకీ బాత్ కార్యక్రమం ప్రజలతో కలసి విధిగా ఏర్పాటు చేయాలన్నారు. శక్తి కేంద్రం ఆధారంగా స్థానికంగా ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని ఉద్యమించాలన్నారు. ఒక వంద ఓటర్ల కు ఒక ప్రతినిధి చొప్పున భాధ్యత స్వీకరించి తదనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయి కి ఇలా 10 గ్రూపులు ఏర్పాటు చేయాలి. ప్రతి రోజు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పార్టీ నేతలు అందరూ ఇంటింటి ప్రచారం నిర్వహించాలి.పార్టీ అభివృద్ధికి పనిచేయాలి. పార్టీ అనుబంధ విభాగాలకు, వివిధ మోర్చాలకు కమిటీలు ఏర్పాటు చేయాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా, అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం van buచేశారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా పార్టీ పనితీరుని సమీక్షించారు. జిల్లా పదాధికారుల సమావేశం.లో జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు