తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే పలు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తున్న నిత్యామీనన్ ఇప్పుడు బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె పెళ్లి గురించిన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ నిత్యామీనన్. అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ. పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమై తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఇటీవలి కాలంలో భీమ్లా నాయక్, స్కైల్యాబ్ సినిమాల్లో కనిపించిన నిత్యా.. కెరీర్ పరంగా డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. కొన్ని రోల్స్ ఆమెకు మాత్రమే నప్పుతాయి అన్నట్లుగా ఉంటుంది. నిత్యామీనన్ పాత్రల ఎంపిక. రీసెంట్‌గా మోడ్రన్ లవ్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించింది. జులై 8 నుంచి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సొంతంగా యూట్యూబ్ చానల్ కూడా పెట్టుకుంది నిత్యామీనన్.
నిత్య అన్‌ఫిల్టర్డ్ పేరుతో యూట్యూబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసి తన 12 ఏళ్ల సినీ కెరీర్‌కి సంబంధించిన విషయాలను వీడియోల రూపంలో తెలియజేస్తోంది. అయితే ఈ హీరోయిన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడంతో అమ్మడి పెళ్లి విషయమై పలు రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రస్తుతం నిత్యా ప్రేమలో మునిగితేలుతోందని, త్వరలోనే ఆమె పెళ్లి పీటలెక్కబోతోందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల ప్రేమ సంగతులు, డేటింగ్ విషయాలు వైరల్ అయ్యాయి. కానీ నిత్యాకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి వార్తలు రాలేదు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఇప్పుడు నిత్యా పెళ్లంటూ న్యూస్ రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే నిత్యా మీనన్ పెళ్లి చేసుకోబోతోందనే టాక్ బయటకొచ్చింది. మలయాళంలో స్టార్ నటుడుగా కొనసాగుతున్న వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాల్లోకి రాకముందు నుంచే అతనితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారిందని అయితే ఆ స్నేహం ప్రేమకు దారి తీయడంతో ఇద్దరు కొన్నాళ్ళు ప్రేమలో మునిగి తేలారంటున్నారు. ఇప్పుడు అతన్నే నిత్యా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ పక్షులు రెండు కుటుంబాలను ఒప్పించడంతో, పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయని టాక్ నడుస్తోంది. సో ఇందులో నిజానిజాల గురించి క్లారిటీ రావాలంటే నిత్యామీనన్ రియాక్ట్ కావాల్సిందే మరి.