కాన్సర్ సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు ” క్వాంటం డాట్ ” అనే టెక్నాలజీని డెవలప్ చేశారు. కృష్ణదేవరాయ యూనివర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగం అభివృద్ధి చేసిన ఈ పరిశోధనకు ఆస్ట్రేలియా, ఇండియా, జర్మనీ నుండి పేటెంట్లను గెలుచుకుంది. ఈ టెక్నాలజీ సాయంతో కొత్త వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని చాలా వరకు తగ్గించవచ్చని నిరూపించిన ఈ అధునాతన టెక్నాలజీని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సీనియర్ ఫెలో పర్సన్ వి.సత్యనారాయణ స్వామి, యూనివర్సిటీ బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మురళీధరరావుతో కలిసి ఈ నూతన టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడెక్కడ కాన్సర్ కణాలు ఉన్నాయి. అలాగే అరుదైన కాన్సర్ రకాలను కూడా ట్రాక్ చేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో వి.సత్యనారాయణ స్వామి తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో, యూనివర్సిటీ బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మురళీధరరావుతో కలిసి పనిచేస్తున్నారు. వీరి పనికి పేటెంట్లు లభించాయన్నారు. ఈ టెక్నాలజీ కారణంగా ఖర్చు కూడా తక్కువవుతుందని వివరించారు. కాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా పేషెంట్ కి ఇచ్చే కీమోథెరఫీ శరీరానికి చాలా హానికరంగా పరిణమిస్తోంది. దీని కారణంగా కాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువ. ఐతే ఇప్పుడు ఈ యూనివర్సిటీ వారు డెవలప్ చేసిన ఈ పరిశోధన కేవలం కాన్సర్ కణాలను మాత్రమే టార్గెట్ చేస్తుంది. తర్వాత నెమ్మది నెమ్మదిగా కాన్సర్ కణాలను నిర్వీర్యం చేసి వాటిని పెరగకుండా నివారించేందుకు సాయపడుతుంది. “ఈ పరిశోధన దాని అయస్కాంత లక్షణం కారణంగా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని దాని కారణంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలని తగ్గించడంలో సహాయపడుతుంది ” అని ఆయన వివరించారు. క్వాంటం డాట్ టెక్నాలజీ ఉపయోగించడం వలన శరీరం పై కాన్సర్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దీని నుంచి శరీరం త్వరగా కోలుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా, క్వాంటం డాట్‌లు (QDలు), తరచుగా సెమీకండక్టర్ నానోక్రిస్టల్స్ (కనీసం 1,000 నానోమీటర్‌ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే స్ఫటికాకార కణం) అని పిలుస్తారు. ఇవి వివిధ రకాల అప్లికేషన్‌లలో విస్తృతంగా ఉపయోగిస్తారన్నారు. ఈ నానోక్రిస్టల్స్ మల్టీప్లెక్స్డ్ బయో-ఇమేజింగ్ , దీర్ఘకాలిక ట్రాకింగ్ ప్రయోగాలలో ఉపయోగిస్తారు. దీని వల్ల రాబోయే తీవ్ర ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు అని తెలిపారు. డాక్టర్ రావు, అతని టీం కృషిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి అభినందించారు.
