ఒక రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలి అంటే వివిధ వసతుల తో పాటు శాంతి భద్రతలు కచ్చితంగా పాటించాలి. క్రైం రేట్ ను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుతూ నేరాలను తగ్గిస్తూ, నేరస్థులను పట్టుకుంటూ వారి మీద నిఘా ఉంచుతూ, నేరాలకు తగ్గ శిక్షలు అమలు చేయడంలో ప్రభుత్వాలు ఆక్టివ్ గా ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ది పథంలో వెళ్ళడానికి మార్గాలు సుగమం అవుతాయి.
నేషనల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో క్రైం రేట్ వివిధ విభాగాల్లో పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాడుల్లో కూడా దేశంలోనే ఎక్కువ నమోదు అవ్వడం బాధాకరం.రాష్ట్ర ప్రభుత్వం దిశా యాప్ అంటూ హడావిడి చేస్తుంది గానీ ఆచరణ మాత్రం పూర్తిగా విఫలం అని రిపోర్ట్స్ చెప్తున్నాయి.National Crime Statistics Report ఆంధ్రప్రదేశ్‌లో 2020తో పోలిస్తే 2021లో ఎస్సీలపై నేరాలు 3.28 శాతం, ఎస్టీలపై నేరాలు 12.81 శాతం పెరిగాయి. గతేడాది దేశవ్యాప్తంగా ఎస్సీలపై జరిగిన నేరాల్లో 3.95, ఎస్టీలపై చోటుచేసుకున్న నేరాల్లో 4.10 శాతం ఏపీలోనే నమోదయ్యాయి. దళితులు, గిరిజనులపై అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది.
మహిళల ఆత్మగౌరవానికి మంట గొలిపే ఘటనలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది ఇలాంటి ఘటనలపై 7,788 కేసులు నమోదవగా అందులో 2,370 (30.43%) ఆంధ్రప్రదేశ్‌లోనే చోటుచేసుకోవడం ఆలోచించదగ్గ విషయం.రాష్ట్రంలో మహిళలపై నేర ఘటనలు 2020 కంటే 2021లో 3.87 శాతం పెరగడం కలవరపరుస్తోంది. 2020లో 17,089 ఘటనలు చోటుచేసుకోగా.. 2021లో 17,752 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి. 2020లో 853 హత్యలు జరగ్గా.. 2021లో 956 చోటుచేసుకున్నాయి. అంతకు ముందు ఏడాది కంటే ఏకంగా 103 హత్యలు ఎక్కువగా జరిగాయి. హత్యల్లో పెరుగుదల 12.07 శాతం.పోలీసులే చట్ట ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడుతున్న ఘటనలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచింది. రిమాండులో ఉన్న వ్యక్తుల మరణాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం.