తిరుపతి వైకుంఠపురం సమీపంలో ఉన్న డ్రైనేజీని శుభ్రం చేయడానికి మాన్ హోల్ లోకి దిగిన మున్సిపల్ ఉద్యోగి ఆర్ముగం లోపల ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందాడు. మరొక ఉద్యోగి మహేష్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.
డ్రైనేజీ తాగునీరు పారిశుధ్యం ఇవన్నీ మున్సిపల్ విభాగం పరిధిలోకి వస్తాయి. ఐతే డ్రైనేజీని శుభ్రపరచడానికి అధునాతన పద్ధతులు ఎన్ని ఉన్న ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తూ చాల మంది ఉద్యోగులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సరైన పని కిట్ లను ఇవ్వకపోగా పాత పద్ధతులనే ప్రోత్సహిస్తూ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. డ్రైనేజీలు లేకపోవడంతో మురుగు రోడ్డుపై పారుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జనజీవనం అస్తవ్యస్తం – మురుగునీటి ప్రవాహం
ఎప్పుడు భారీ వర్షాలు పడినా తిరుపతి నగరం తడిసి ముద్దవుతోంది. మురుగునీరు రోడ్ల మీద పొంగి పొర్లుతుంది నగరంలోని వీధులు, ప్రధాన రహదారులన్నీ జలసంద్రంగా మారిపోతాయి. నడుము లోతు నీరు చేరడంతో పాటు మాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి దీంతో తిరుపతి వాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. తిరుమలలో అడపాదడపా వర్షానికే మంహోల్స్ పొంగిపొర్లుతున్నాయి.
మొద్దునిద్రలో మున్సిపల్ విభాగం
డ్రైనేజీ నిర్వహణతో పాటు పారిశుద్యం వాటర్ ఇవన్నీ మున్సిపల్ విభాగంలోకి వస్తాయి సరైన ప్రణాళిక లేకపోవటం వలన మాన్ హోల్స్ నిర్వహణ పూర్తిగా గాలికొదిలేదరు డ్రైనేజీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అధునాతన పద్దతులను ఉపయోగించకపోగా మాన్ హోల్స్ లోకి మనుషులను పంపి శుభ్రం చేసేస్తున్నారు. దీంతో ప్రమాదకర గ్యాస్ లు ఒక్కసారిగా లోపల విడుదలయ్యి లోపల దిగిన మనిషి ప్రాణాలను హరించేస్తున్నాయి.
ప్రభుత్వం కళ్ళు తెరవాలి – ప్రజల ప్రాణాలు కాపాడాలి
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన తప్పుడు పద్దతుల వలన సామాన్య ఉద్యోగుల పరిస్థితి ప్రమాదంలో పడింది మాన్ హోల్ లోకి దిగకపోతే ఉద్యోగ సమస్య దిగితే ప్రాణంతో చెలగాటం ఇటువంటి సందిగ్ద పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఉద్యోగ ధర్మంతో మాన్ హోల్ లోకి దిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో కోర్టు తీర్పులు ఉన్న అవన్నీ పట్టించుకునే నాధుడే లేరు. మాన్ హోల్స్ లోకి మనుషులను పంపే వ్యవస్థను రద్దు చేయాలనీ ఎన్ని తీర్పులున్నా అవన్నీ నీటి బీరలో నెయ్యి చందంలా తయారయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఇటువంటి అనాగరిక పద్ధతులకు స్వస్తి పలకాలని ప్రజానీకం కోరుకుంటున్నారు.