ఐఎండీ సూచనల ప్రకారం దక్షిణ ఒడిశా మరియు దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు.
వరద సహాయక చర్యల్లో మొత్తం 6ఎన్డీఆర్‌ఎఫ్, 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉన్నందున లంక గ్రామల ప్రజలు వారి ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటు-లో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101, 08632377118 సంప్రదించాల్సిందిగా సూచించారు. గోదావరి,కృష్ణా, తుంగభద్ర పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.